Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

కారు రిపేర్ అయింది.. స్మగ్లింగ్ ప్లాన్ రివర్స్ అయింది.. సూర్యాపేటలో హైడ్రామా..!

సూర్యాపేటలో జాతీయ రహదారిపై సడన్ గా కారు బ్రేక్ డౌన్ అయ్యి రిపేరు అయ్యింది. కారు ఆగిపోవడంతో స్మగ్లింగ్ ప్లాన్ బయటపడింది. సినిమా ఫక్కీలో గుట్టు రట్టు అయ్యింది.

కారు రిపేర్ అయింది.. స్మగ్లింగ్ ప్లాన్ రివర్స్ అయింది.. సూర్యాపేటలో హైడ్రామా..!

మన సాక్షి, సూర్యాపేట :

సూర్యాపేటలో జాతీయ రహదారిపై సడన్ గా కారు బ్రేక్ డౌన్ అయ్యి రిపేరు అయ్యింది. కారు ఆగిపోవడంతో స్మగ్లింగ్ ప్లాన్ బయటపడింది. సినిమా ఫక్కీలో గుట్టు రట్టు అయ్యింది. వివరాల ప్రకారం.. 65వ నెంబర్ జాతీయ రహదారిపై బ్రేక్ డౌన్ అయ్యి రిపేరు వచ్చిన కారును తరలిస్తుండగా 110 కేజీల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కారు ఆగిపోవడంతో వారు బోయింగ్ వాహనాన్ని ఆశ్రయించారు. బోయింగ్ వాహనం సాయంతో కారును తరలించేందుకు ప్రయత్నిస్తుండగా ముందస్తు సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. వాహనాలను గమనించిన కారులోని వ్యక్తులను పోలీసులు గమనిస్తుండగానే భయంతో వారు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు.

Also Read : Miryalaguda : మిర్యాలగూడలో బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం.. కిలో ఎంతంటే..!

అప్రమత్తమైన పోలీసులు కారును తనిఖీ చేయగా 110 కేజీల గంజాయి లభ్యమయింది. కారుతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. రహదారిపై వాహనం చెడిపోవడంతో స్మగ్లింగ్ ప్లాన్ తిరగబడింది.

మరిన్ని వార్తలు