Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం..!
సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం..!
సూర్యాపేట, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తమ్మర గ్రామ శివారులో వేగంగా వచ్చిన డీసీఎం వాహనం బైక్ను బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో అనంతగిరి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన భూక్య నవీన్, భూక్య ప్రసాద్ ప్రాణాలు కోల్పోయారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనతో కొత్తగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









