భయంకరమైన రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం..!
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో సోమవారం ఉదయం భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది . ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు.

భయంకరమైన రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో సోమవారం ఉదయం భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది . ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. పానిఫట్ – ఖతియ జాతీయ రహదారిపై ఒక కారు అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లైట్ ఫోల్ ను బలంగా ఢీ కొట్టింది. ఢీ కొట్టిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. ఉన్నట్టుండి వాహనం నలవైపులా మంటలు వ్యాపించాయి.
Also Read : పండుగ వేళ విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య..!
కారులో ఉన్న ప్రయాణికులకు బయటకు వచ్చే అవకాశంలోకి లేకుండా పోయింది. దాంతో ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో కాలిపోయిన ఆరుగురు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం మేరకు హర్యానాలోని జీంద్ జిల్లాకు చెందిన వారుగా భావిస్తున్నారు. మృతుల్లో 12 ఏళ్ల వయసు గల ఒక చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మృతుల వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.









