Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం..!
హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం..!
మన సాక్షి, కూకట్ పల్లి :
హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కూకట్పల్లిలోని అస్బెస్టాన్ కాలనీలో పేపర్ టీ కప్పులు, ప్లేట్లు తయారు చేసే కంపెనీలో సోమవారం తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. దాంతో నెయ్యి, కుర్కురే, హల్దీరాం స్టాక్ గోదాములకు మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేశారు. ప్రమాదంలో ప్రాణనష్టం ఏమీ జరగలేదని అధికారులు పోలీసులు వెల్లడించారు. కానీ భారీగా ఆస్తి నష్టం మాత్రం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.









