Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు.. గృహప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బాలు నాయక్..! 

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.

ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు.. గృహప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బాలు నాయక్..! 

( చింతపల్లి – వెంకట్ )

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. ఆదివారం దీపావళి పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , టీపీసీసీ నాయకత్వం నిర్దేశించిన కార్యక్రమాల మేరకు చింతపల్లి మండలం ప్రశాంతపురి తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రశాంతపురి 2 తండాలో నూతనంగా నిర్మించిన మూడు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇస్లావత్ విజయ – ఉన్యా, ఇస్లావత్ పింప్లి – చత్రు నాయక్, ఇస్లావత్ బూరి – గర్రు నాయక్ కుటుంబాల నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొని, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి లబ్ధిదారుల నూతన గృహాల్లోనే దీపావళి సంబరాలు జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి ఆనందంలో భాగస్వాములయ్యారు.

Also Read : ప్రభుత్వ ఉద్యోగం కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్.. నల్గొండ జిల్లాలో గుట్టు రట్టు.. 14 మంది అరెస్ట్..!

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని అన్నారు. ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఎంతో భరోసానిస్తున్నాయని, నేడు ఆ కుటుంబాలు సొంతింటిలో దీపాలు వెలిగించుకుంటూ దీపావళి పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు.. పేద కుటుంబాల ఆత్మగౌరవానికి, భద్రతకు, భవిష్యత్తుకు ప్రతీక అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేద కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయని, ప్రతి లబ్ధిదారుడి ముఖంలో కనిపిస్తున్న ఆనందమే ప్రజా ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి అని అన్నారు. ప్రతి పేద కుటుంబం సొంతింటిలో గౌరవంగా జీవించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని, దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే బాలు నాయక్  స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జటావత్ హరినాయక్, దొంతం అలివేలు సంజీవరెడ్డి, కొండూరు పవన్ కుమార్, అంగిరేకుల నాగభూషణం, ఎరుకల వెంకటయ్య గౌడ్, మాస భాస్కర్, యాచారపు యాది గౌడ్, దాసరి శ్రీనివాస్ యాదవ్, అంగిరేకుల గోవర్ధన్, కేతావత్ శ్రీను నాయక్, అనంతుల శ్రీను, గౌని జంగయ్య, కొప్పుల జంగయ్య, వసంత్ నాయక్, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు