ఐఏఎస్ అధికారి తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష..!
న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి ఉన్నతాధికారులైనా శిక్షకు గురికావాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డికి ఆరు నెలల సాధారణ కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

ఐఏఎస్ అధికారి తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష..!
హైదరాబాద్, మన సాక్షి :
న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి ఉన్నతాధికారులైనా శిక్షకు గురికావాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డికి ఆరు నెలల సాధారణ కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. అంతే కాకుండా రూ.2 వేల జరిమానా కూడా విధించింది. జస్టిస్ కె. లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేసింది.
అసలు వివాదం..?
రిజిస్ట్రేషన్ చట్టం–1908లోని సె క్షన్ 22-A ప్రకారం నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న కొన్ని ప్లాట్ల ను తొలగించాలంటూ బాధితు లు హైకోర్టును ఆశ్రయించారు. వారి వినతిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని 2025 ఆగ స్టులో న్యాయస్థానం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. కోర్టు నిర్దేశించిన ప్రకారం 60 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Also Read : ఇరికుల్లలో విషాదం.. భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య..!
అయితే గడువు ముగిసినా కలెక్టర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బాధితులు 20 25 అక్టోబర్ 15న కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ దాఖలైన తర్వాతే అధికార యంత్రాంగం స్పందించింది. బాధితులకు నోటీసులు జారీ చేసి 2026 ఫిబ్రవరి 26న వారి వినతిని తిరస్కరించింది. అనంతరం జూలై 8న మరోసారి తిరస్కరణ ఉత్తర్వులు జారీ చేసిం ది.
కోర్టు ఆగ్రహం.. కలెక్టర్‌కు శిక్ష!
న్యాయస్థానం విధించిన గడువు లోగా స్పందించకుండా, కోర్టు ధి క్కరణ పిటిషన్ దాఖలైన తర్వా త మాత్రమే నిర్ణయం తీసుకోవ డంపై ధర్మాసనం తీవ్ర అభ్యంత రం వ్యక్తం చేసింది. న్యాయస్థా నం ఆదేశాలను అమలు చేయ డంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు నిర్ధారించింది.
ఐఏఎస్ స్థాయి ఉన్నతాధికారి సైతం న్యాయస్థానం ఉత్తర్వు లను బేఖాతరు చేయడం సమ ర్థనీయం కాదని స్పష్టం చేస్తూ కలెక్టర్ సి. నారాయణరెడ్డికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. అ యితే అప్పీలు చేసుకునేందుకు నాలుగు వారాల గడువు కల్పి స్తూ శిక్ష అమలును తాత్కాలి కం గా నిలి పివేసింది. న్యాయస్థానం ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వ హిస్తే ఉన్నతాధికారులకూ చట్టం నుం చి మినహాయింపు ఉండ ద నే విషయాన్ని ఈ తీర్పు మరో సారి స్పష్టం చేసింది.









