Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణవరంగల్ పట్టణ జిల్లా
Viral : కానిస్టేబుల్ ను చితకబాదిన మరో కానిస్టేబుల్..!
కానిస్టేబుల్ ను మరో కానిస్టేబుల్ చితకబాదిన ఘటన వరంగల్ లో చోటుచేసుకుంది.

Viral : కానిస్టేబుల్ ను చితకబాదిన మరో కానిస్టేబుల్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
కానిస్టేబుల్ ను మరో కానిస్టేబుల్ చితకబాదిన ఘటన వరంగల్ లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. వరంగల్ పట్టణంలోని ఉర్సు గుట్ట వద్ద బార్ లో మద్యం తాగి బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేస్తున్నాడంటూ బార్ సిబ్బంది 112 కు డయల్ చేసి ఫిర్యాదు చేశారు. దాంతో సమాచారం అందుకున్న బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి బార్ వద్దకు వచ్చారు. కాగా అప్పటికే బెటాలియన్ కానిస్టేబుల్ షర్టు విప్పుకొని ఉన్నాడు.
దాంతో షర్ట్ వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి చెంపపై కొట్టాడు. దాంతో బెటాలియన్ కానిస్టేబుల్ తిరిగి సంతోష్ రెడ్డి చంప చెల్లుమనిపించాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో బెటాలియన్ కానిస్టేబుల్ ను సంతోష్ రెడ్డి లాఠీ తో కొట్టాడు. అక్కడే ఉన్న స్థానికులు బెటాలియన్ కానిస్టేబుల్ లాటీలతో చితక బాదారు.









