Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

నల్లగొండ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు.. హత్య కేసులో నిందితుడికి రెండు జీవిత ఖైదులు, మరో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష..! 

హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. రెండు జీవిత ఖైదులతో పాటు మరో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం (నవంబర్ 23, 2026) కీలక తీర్పు వెలువరించింది.

నల్లగొండ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు.. హత్య కేసులో నిందితుడికి రెండు జీవిత ఖైదులు, మరో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష..! 

నల్లగొండ, మన సాక్షి :

హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. రెండు జీవిత ఖైదులతో పాటు మరో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం (నవంబర్ 23, 2026) కీలక తీర్పు వెలువరించింది. పోలీసుల పటిష్టమైన దర్యాప్తు, ప్రాసిక్యూషన్ సమర్థవంతమైన వాదనలతో నిందితుడిపై నేరం నిరూపితమైంది.

నల్లగొండ జిల్లా హాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అనుముల గ్రామానికి చెందిన యనక ప్రభాకర్ (34)ను అదే గ్రామానికి చెందిన టేకి సురేష్ (32) డబ్బుల లావాదేవీలు, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో హత్య చేశాడు. 2020 సెప్టెంబర్ 24న హాలియా ఎన్‌ఎస్‌పీ ఎడమ కాలువ రివులెట్ బ్రిడ్జి సమీపంలో ప్రభాకర్ తలపై సుత్తితో బలంగా కొట్టి ప్రాణాలు తీశాడు.ఈ ఘటనపై హాలియా పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 202/2020గా ఐపీసీ 302, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధ క చట్టం 3(2)(v), దివ్యాంగుల హక్కుల చట్టం-20 16 లోని సెక్షన్ 92(a) కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మూడు సెక్షన్ల కింద కఠిన శిక్షలు

పోలీసులు సేకరించిన పటిష్టమైన సాక్ష్యాధారాలు, ప్రా సిక్యూషన్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న నల్ల గొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం రెండో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి నిందితుడికి శిక్ష ఖరారు చేశారు. ఐపీసీ 302 సెక్షన్ జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం 3(2)(v) మరో జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా, దివ్యాంగు ల హక్కుల చట్టం 92(a)ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించడంతో పాటు
మూడు శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని న్యా యస్థానం ఆదేశించింది. జరిమానా చెల్లించని పక్షంలో ప్రతి సెక్షన్ కింద అదనంగా నాలుగు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది.

పోలీసు, ప్రాసిక్యూషన్ బృందానికి ఎస్పీ అభినందనలు

ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా ద ర్యాప్తు నిర్వహించి, నేర నిరూపణకు అవసరమైన ఆ ధారాలను న్యాయస్థానంలో సమర్పించిన పోలీసు అధి కారులు, ప్రాసిక్యూషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కేసు దర్యాప్తులో అప్పటి ఎస్‌ఐ జె. శివకుమార్, సీఐ పి. వీర రాఘవులు, మిర్యాలగూడ ఎస్‌డీపీఓ వై. వెంకటేశ్వర్ రావు, ప్రస్తుత మిర్యాలగూడ ఇన్‌చార్జ్ డీఎస్పీ రవి, హాలియా సీఐ రాఘవరావు, డీసీఆర్‌బీ సీఐ శ్రీనునాయక్, ఎస్‌ఐ సాయి ప్రశాంత్ కీలక పాత్ర పోషించారు.అలాగే అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రేడ్-1 ఎస్. శోభారాణి, కోర్టు డ్యూటీ ఆఫీసర్ హెడ్ కానిస్టేబుల్ ఆర్. పద్మయ్య, లైజన్ అధికారులు పి. నరేందర్, ఎన్. మల్లికార్జున్ చేసిన కృషిని ఎస్పీ ప్రశం సించారు.నేరం చేసిన వారికి చట్టప్రకారం శిక్ష పడేలా పోలీసు శాఖ కట్టుదిట్టమైన దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాల సేకరణతో ముందుకు సాగుతోందని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు