Breaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య
Miryalaguda : జేవీవీ టాలెంట్ టెస్టులో ఎస్పిఆర్ విద్యార్థుల ప్రతిభ..!
జన విజ్ఞాన వేదిక తెలంగాణ వారి ఆద్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు - 2026 టాలెంట్ టెస్ట్ మండల స్థాయిలో మిర్యాలగూడ కు చెందిన ఎస్పిఆర్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.

Miryalaguda : జేవీవీ టాలెంట్ టెస్టులో ఎస్పిఆర్ విద్యార్థుల ప్రతిభ..!
మిర్యాలగూడ, మన సాక్షి
జన విజ్ఞాన వేదిక తెలంగాణ వారి ఆద్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు – 2026 టాలెంట్ టెస్ట్ మండల స్థాయిలో మిర్యాలగూడ కు చెందిన ఎస్పిఆర్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీలు మిర్యాలగూడ యందు నిర్వహించగా సుమారు 40 పాఠశాలలు పాల్గొన్నాయి. ఇందు రాఘవేంద్రకాలనిలో ఉన్న ఎస్.పి.ఆర్ పాఠశాల, విద్యార్ధులు వి. సాయి సింధు (10వ తరగతి), ఎన్. హాసిని (9వ తరగతి), టి. మనస్విని (8వ తరగతి) ప్రధమ బహుమతిని సాదించి, జిల్లాస్థాయిలో నిర్వహించే టాలెంట్ టెస్టు అర్హత సాదించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను స్కూల్ ప్రిన్సిపాల్ బి. జనార్దన్ రెడ్డి, డైరెక్టర్స్ యామిని వెంకటేశ్వర్లు, నాదెండ్ల అయ్యన్న మరియు ఉపాధ్యాయులు అభినందించారు.










