Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య.. ఉద్రిక్తత..!
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగులూరు సమీపంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కార్తీక్ (16) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య.. ఉద్రిక్తత..!
(ఇబ్రహీంపట్నం – శేఖర్)
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగులూరు సమీపంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కార్తీక్ (16) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నూతన గృహప్రవేశం ఉన్నందున ఇంటికి వెళ్లాలని ప్రిన్సిపల్ ను సెలవు కోరగా పర్మిషన్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన కార్తీక్ రూంలోకి వెళ్లి ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిపిన విద్యార్థులు.
శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ కారణంగానే కార్తీక్ అనే విద్యార్థి ఉరివేసుకున్నట్లు తెలిసింది. దాంతో విద్యార్థి సంఘాలు కళాశాల వద్ద ఆందోళన నిర్వహించారు. దాంతో ఉద్రిక్తత నెలకొన్నది. కాగా శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ వద్దకు పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.









