Breaking Newsజిల్లా వార్తలునల్గొండ
కష్టకాలంలో అండగా.. బాధిత కుటుంబానికి భరోసాగా నేనావత్ కిషన్ నాయక్..!
దేవరకొండ మండలం పరిధిలోని కమలాపురం గ్రామానికి చెందిన పల్లపు సైదులు మరణం ఎంతో బాధాకరమని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ అన్నారు.

కష్టకాలంలో అండగా.. బాధిత కుటుంబానికి భరోసాగా నేనావత్ కిషన్ నాయక్..!
(చింతపల్లి, మన సాక్షి – వెంకట్)
దేవరకొండ మండలం పరిధిలోని కమలాపురం గ్రామానికి చెందిన పల్లపు సైదులు మరణం ఎంతో బాధాకరమని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ అన్నారు. శుక్రవారం వారి నివాసానికి వెళ్లి సైదులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా మీ కుటుంబానికి అన్ని విధాలుగా ఆసరాగా ఉంటామని కిషన్ నాయక్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 35,000/- ఆర్థిక సహాయం అందజేయడమే కాకుండా, సైదులు పిల్లల చదువుల బాధ్యతకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









