Miiryalaguda : అయ్యప్ప స్వాముల శబరిమలై దర్శనానికి ప్రత్యేక రైలు.. మిట్టపల్లి సేవభావంతో 1200 మందికి ఉచిత రైలు టికెట్లు..!
మిర్యాలగూడలోని అయ్యప్ప మాలదారుల కోసం యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సామజిక కార్యకర్త మిట్టపల్లి వెంకటేష్ ఉచిత సేవాకార్యానికి శ్రీకారం చుట్టారు.

Miiryalaguda : అయ్యప్ప స్వాముల శబరిమలై దర్శనానికి ప్రత్యేక రైలు.. మిట్టపల్లి సేవభావంతో 1200 మందికి ఉచిత రైలు టికెట్లు..!
ఉచిత రైలు సీట్ల రిజిస్ట్రేషన్ కోసం.. ఫోన్ నంబర్స్ ఇవీ
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడలోని అయ్యప్ప మాలదారుల కోసం యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సామజిక కార్యకర్త మిట్టపల్లి వెంకటేష్ ఉచిత సేవాకార్యానికి శ్రీకారం చుట్టారు. సుమారు 1200 మంది అయ్యప్ప స్వాములను ఉచితంగా శబరిమలై యాత్రకు వెళ్లే స్వాములకు ప్రత్యేక రైలును తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తున్నట్లు యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకటేష్ తెలిపారు.
మిర్యాలగూడలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్యాలగూడ వాసిగా నియోజకవర్గ ప్రజలకు తన వంతుగా సేవ చేయాలనే సంకల్పంతో పవిత్ర కార్తీక మాసంలో.. అయ్యప్పస్వామి మాలదారులైన వారి కోసం ప్రత్యేకంగా రైలు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని అయ్యప్ప మాలధారులు.. శబరిమలై యాత్ర కోసం ఏర్పా టు చేసిన ప్రత్యేక రైలు వచ్చేనెల 22న అయ్యప్పస్వాములతో మిర్యాలగూడ నుంచి బయలుదేరి చెంగనూరు వరకు వెళుతుందన్నారు. అలాగే 25వ తేదీ చెంగనూరు నుంచి మిర్యాలగూడకు చేరుకుంటుందని చెప్పారు.
అందుకుగాను మిర్యాలగూడ నియోజకవర్గంలోని అయ్యప్పస్వామి మాలాదారులు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్లతో ఈ నెల 28వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పిలుపు నిచ్చారు. పార్టీలకు అతీతంగా భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిట్టపల్లి వెంకటేష్ కోరారు. సీట్ల రిజిస్ట్రేషన్ కోసం 8142782580, 9014 592580 నెంబర్లను సంప్రదించాలని చెప్పారు. శబరిమలై యాత్రకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గురుస్వామి మాశెట్టి శ్రీనివాస్, వంశీ తదితరులున్నారు.










