Miryalaguda : నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నీటిని ఏపి కి తరలించే ప్రయత్నాలను అడ్డుకోవాలి
మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీ బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమోతు భాస్కర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Miryalaguda : నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నీటిని ఏపి కి తరలించే ప్రయత్నాలను అడ్డుకోవాలి
కాంగ్రెస్ 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం
– మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీ బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమోతు భాస్కర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో అమలు చేయలేక పోయిందని విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ హామీల ప్రతులను చించి చెత్తబుట్టలో వేసి నిరసన వ్యక్తం చేశారు.
అదేవిధంగా నాగార్జునసాగర్ డ్యామ్‌లో ఉన్న డెడ్ స్టోరేజీ నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించే ప్రయత్నాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల సాగునీటి అవసరాలను, రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి నీటిని తరలించే ప్రయత్నాలు చేయడం సరికాదని అన్నారు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్ర నీటి హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజల హక్కులు, రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం బి ఆర్ ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని భాస్కర్ రావు స్పష్టం చేశారు.
కార్యక్రమములో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, నాయకులు ఎండి. యూసుఫ్, దుర్గంపూడి నారాయణ రెడ్డి, ధనావత్ చిట్టిబాబు నాయక్, ఎడవెల్లి శ్రీనివాస రెడ్డి, అన్నబీమోజు నాగార్జున చారి,ఎండి. ఇలియాస్ ఖాన్, మట్టపల్లి సైదయ్య యాదవ్, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాలుట్ల బాబయ్య, కుందురు వీరకోటిరెడ్డి,
పెద్ది శ్రీనివాస గౌడ్, ఎండి. మాజీద్, దైద సత్యం, పెండ్యాల పద్మ, గుడిసె దుర్గా ప్రసాద్, సందేషి అంజన్ రాజు, మర్రి అంజిబాబు, యర్రమళ్ళ దినేష్, ఎర్ర శ్రీను, పశ్యా శ్రీనివాస్ రెడ్డి, గంగుల బిక్షం యాదవ్, నంద్యాల శ్రీరాం రెడ్డి, ప్రసాద్, పులి జగదీష్, పేరాల కృపాకర్ రావు, పునాటి లక్ష్మీనారాయణ, ప్రకాష్ నాయక్, ఎండి.షోయబ్, వేలిచేటి రామకృష్ణ, శిరసన గండ్ల ఈశ్వర చారి, మజ్జిగపు సుధాకర్ రెడ్డి, కట్టా మల్లేష్ గౌడ్, జేరిపోతుల రాములు గౌడ్, దస్రు నాయక్, ధనావత్ వెంకటేశ్వర్లు నాయక్, మాలవాత్ రవీందర్ నాయక్ తదితరులు ఉన్నారు.










