ఏసీబీ వలకు చిక్కిన తిమింగళం.. రూ.1.50 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పబ్లిక్ ప్రాసిక్యూటర్..!
న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన బాధితుడికే లంచం డిమాండ్ చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కాడు

ఏసీబీ వలకు చిక్కిన తిమింగళం.. రూ.1.50 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పబ్లిక్ ప్రాసిక్యూటర్..!
పెద్దపల్లి, మన సాక్షి :
న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన బాధితుడికే లంచం డిమాండ్ చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కాడు. పెద్దపల్లి కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహిస్తున్న రవీందర్.. ఓ కేసులో బాధితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.1.50 లక్షలు లంచం అడిగినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఆయనను పట్టుకున్నారు.
బాధితుడిని లంచం కోసం వేధింపులు
కేసు విషయంలో తనకు సహకరించడంతో పాటు అనుకూలంగా వ్యవహరించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్ బాధితుడి నుంచి రూ.1.50 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. లంచం ఇవ్వడం ఇష్టం లేకపోవడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు నిందితుడిని పట్టుకునేందుకు వ్యూహం రచించారు.
పక్కా ప్లాన్‌తో ఏసీబీ ట్రాప్
కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి నేతృత్వం లోని బృందం సూచనల మేరకు బాధితుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు రూ.1.50 లక్షలు అందజేశాడు. నగదు తీసుకుంటున్న సమయంలోనే ఏసీబీ అధికారులు దాడిచేసి రవీందర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్ర స్తుతం అధికారులు ఘటనాస్థలంలో విచారణ చేప ట్టారు. పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
న్యాయవ్యవస్థలో కలకలం
న్యాయం అందించాల్సిన బాధ్యతా యుతమైన పదవిలో ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ లంచం తీసుకుంటూ ఏ సీబీకి చిక్కడం పెద్దపల్లి జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యా ప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ఎనిమిదో మెట్రోపాలిటన్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్న లక్ష్మి కూడా బాధితుడికి న్యాయం చేస్తానని రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన తెలిసిందే. తాజాగా పెద్దపల్లి ఘటన న్యాయవ్యవస్థలో అవినీతి ఆరోపణలపై మరోసారి చర్చకు తెరలేపింది.









