Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

ఆకట్టుకున్న సైన్స్ ఫెయిర్.. ఆసక్తిగా పరిశీలించిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి..! 

ఇబ్రహీంపట్నం నల్ల కంచెలోని తెలంగాణా సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం జరిగిన జోనల్ లెవల్ సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఆకట్టుకుంది. ఇందులో విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఆకట్టుకున్న సైన్స్ ఫెయిర్.. ఆసక్తిగా పరిశీలించిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి..! 

(ఇబ్రహీంపట్నం, మన సాక్షి – శేఖర్)

ఇబ్రహీంపట్నం నల్ల కంచెలోని తెలంగాణా సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం జరిగిన జోనల్ లెవల్ సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఆకట్టుకుంది. ఇందులో విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

వివిధ జిల్లాల నుంచి 63 పాఠశాలలకు చెందిన 252 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని,తమలోని సృజనాత్మకతను,శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని ప్రదర్శించారు.సైన్స్,సాంకేతిక పరిజ్ఞానం,పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమస్యలు, నిత్యజీవితంలో ఎదురయ్యే సవాళ్లకు శాస్త్రీయ పరిష్కారాలు వంటి విభిన్న అంశాలపై విద్యార్థులు రూపొందించిన నమూనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

Also Read : Breaking : ట్రాక్టర్ ను ఢీ కొట్టిన టిప్పర్.. మానవత్వం చూపిన ఎమ్మెల్యే బిఎల్ఆర్..!

సైన్స్‌ ఫెయిర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి విద్యార్థినులు సాంస్కృతిక ప్రదర్శనలతో స్వాగతం పలికారు.ప్రతి స్టాల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే… విద్యార్థులతో ముచ్చటించారు. వారు రూపొందించిన ప్రాజెక్టుల వివరాలను అడిగి తెలుసుకుని, వారి ఆలోచనలను అభినందించారు.

చిన్న వయసులోనే శాస్త్రీయ దృక్పథంతో ఆలోచిస్తూ వినూత్న ఆవిష్కరణలు చేయడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి సైన్స్ ఫెయిర్‌లు ఎంతో దోహదపడతాయని మల్‌రెడ్డి పేర్కొన్నారు.విద్యార్థుల ఉత్సాహం,ప్రతిభతో సైన్స్ ఫెయిర్ ప్రాంగణం సందడిగా మారింది.

మరిన్ని వార్తలు