Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

మాడుగులపల్లి తాసిల్దార్ సంచలన నిర్ణయం.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బోరు బావులు సీజ్..!

నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండల తాసిల్దార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బోరు బావులను సీజ్ చేశారు.

మాడుగులపల్లి తాసిల్దార్ సంచలన నిర్ణయం.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బోరు బావులు సీజ్..!

కోయలపాడులో 9 అక్రమ విద్యుత్ బోరు బావులు సీజ్

విద్యుత్ సరఫరా నిలిపి వేసి ,కేసింగ్ తొలగించిన అధికారులు

(మాడ్గులపల్లి, మనసాక్షి  – మౌలాలి)

నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండల తాసిల్దార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బోరు బావులను సీజ్ చేశారు. మండలంలోని  ఆగామోత్కూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గుర్రప్పగూడెం గ్రామ పంచాయతీ శివారులోని కోయలపాడు సమీపంలో నూకనాయిని చెరువు పరిధిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా వాల్టా చట్టానికి విరుద్ధంగా అక్రమంగా ఏర్పాటు చేసుకున్న విద్యుత్ భూగర్భ జల బావులను సోమవారం అధికారులు సీజ్ చేశారు.

సోమవారం తహసీల్దార్ సామల సరోజ పావని, నీటిపారుదల శాఖ ఎఈ వేణుగోపాల్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్ పెక్టర్ శ్యామ్, గ్రామ పాలనాధికారులు శ్రీనువాస్,రామారావు లతో పాటు విద్యుత్, పోలీస్ సిబ్బందితో కలిసి అక్రమ విద్యుత్ భూగర్భ జల బావులను సీజ్ చేశారు.

9 బావుల సీజ్, విద్యుత్ కట్, కేసింగ్ తొలగింపు :

గుర్రప్పగూడెం గ్రామ పంచాయతీ కోయలపాడు గ్రామానికి చెందిన ఏనుగుల జానకిరాంరెడ్డికి చెందిన 3, కట్టా కృష్ణారెడ్డి కి చెందిన 2, నర్సిరెడ్డి,అనంతరెడ్డి, మంత్రాల దశరథరెడ్డి, సుంకిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,లకు చెందిన ఒక్కొక్కటి చొప్పున మొత్తం 9 అక్రమ విద్యుత్ భూగర్భ జల బావులను సీజ్ చేసి, విద్యుత్ సరఫరా లను తొలగించారు. ఏనుగుల జానకిరెడ్డికి చెందిన విద్యుత్ భూగర్భ జల బావులలోని కేసింగ్ లను జేసీబీ సహాయంతో తొలగించినట్లు అధికారులు తెలిపారు.

కఠిన చర్యలు తీసుకుంటాం – తహసీల్దార్ హెచ్చరిక:

ఈ సందర్భంగా మండల తహసీల్దార్, మేజిస్ట్రేట్ సామల సరోజ పావని మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటల సమీపంలో అక్రమంగా భూగర్భ జల బావులు ఏర్పాటు చేసినట్లయితే వాల్టా చట్టానికి అనుగుణంగా నిందితులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎలెనినో ప్రభావం కారణంగా రానున్న నాలుగు నెలల కాలంలో ఎలాంటి భూగర్భ విద్యుత్ బావుల ఏర్పాట్లపై ప్రభుత్వం నిషేధంవిధించడం జరిగిందని ఆమె తెలిపారు. రైతులు, మండల ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసి ప్రభుత్వ భూములు, ఆస్తులను పరిరక్షించేందుకు అధికారులకు సహకరించాలని ఆమె కోరారు.

మరిన్ని వార్తలు