Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

హరిజనపురం గ్రామ సర్పంచ్‌కు జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు..! 

చింతపల్లి మండల పరిధిలోని హరిజనపురం గ్రామ సర్పంచ్ తంగేళ్ల రామకృష్ణకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. గ్రామాభివృద్ధి, ప్రజాసేవ, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా బహుజన సాహిత్య అకాడమీ 'జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు'ను ప్రదానం చేసింది.

హరిజనపురం గ్రామ సర్పంచ్‌కు జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు..! 

(చింతపల్లి, మనసాక్షి – వెంకట్)

చింతపల్లి మండల పరిధిలోని హరిజనపురం గ్రామ సర్పంచ్ తంగేళ్ల రామకృష్ణకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. గ్రామాభివృద్ధి, ప్రజాసేవ, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా బహుజన సాహిత్య అకాడమీ ‘జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు’ను ప్రదానం చేసింది.

​దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సు మరియు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా సర్పంచ్ రామకృష్ణ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

Also Read : తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం.. ప్రతి కుటుంబానికీ రూ.5లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా..!

ఈ సందర్భంగా సర్పంచ్ తంగేళ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. ఒక మారుమూల గ్రామమైన హరిజనపురానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఎంతో గర్వకారణంగా, ఆనందంగా ఉందని తెలిపారు. గ్రామంలో అంతర్గత సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి వసతి, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ పథకాలను అర్హులైన పేదలకు అందించడంలో నిరంతరం కృషి చేస్తున్నట్లు వివరించారు. గ్రామ సమగ్రాభివృద్ధికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ నిరంతర ప్రోత్సాహం, సహకారం ఎంతో ఉందని, ఆయన అందించిన నిధులతోనే గ్రామ రూపురేఖలు మారాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ పరుస్తున్నారన్నారు. ఈ అవార్డు తనపై బాధ్యతను మరింత పెంచిందని, రాబోయే రోజుల్లో గ్రామస్తులందరి సహకారంతో హరిజనపురాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. కాగా, సర్పంచ్ తంగేళ్ల రామకృష్ణకు జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు లభించడంపై గ్రామస్తులు, వార్డు సభ్యులు, మండల ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు