తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం.. ప్రతి కుటుంబానికీ రూ.5లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా..!
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టనుంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుం బం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకో కుండా అండగా నిలిచేందుకు ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీ మా పథకం’ అమలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం.. ప్రతి కుటుంబానికీ రూ.5లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా..!
మన సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టనుంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకో కుండా అండగా నిలిచేందుకు ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీ మా పథకం’ అమలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత ప్రయోజనం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టు కుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ పథకానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
18 నుంచి 59 ఏళ్ల వయస్సు వారికి అవకాశం
కుటుంబాన్ని పోషించే 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన ఒక సభ్యుడిని బీమా పొందే వ్యక్తిగా ప్రతిపాదించారు. వయస్సు ధ్రువీకరణకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నారు. కాగా మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19న ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు నుంచి ప్రత్యేక శిబిరాల ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా గ్రామాలు, పట్టణాల్లో క్యాంపులు నిర్వ హించనున్నారు.
పథకం ప్రధాన ఉద్దేశాలు ఇవే
–ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడం,
–కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆర్థిక సహాయం అందించడo
–కుటుంబ సభ్యులు ఆర్థిక సంక్షోభంలో పడకుండా అండగా నిలవడం
–ప్రతి కుటుంబానికి సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడం.
మరిన్ని వివరాలకు ఎక్కడ సంప్రదించాలి?
పథకానికి సంబంధించిన దరఖాస్తులు, అర్హతలు, విధివిధానాల వివరాల కోసం సమీపంలోని ఎంపీడీఓ కార్యాలయం, గ్రామపంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలి. ప్రభుత్వం ప్రకటించే అధికారిక మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రతిపాదించిన ఈ పథకం అమలులోకి వస్తే రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు జీవిత బీమా రక్షణ అందించే అవకాశం ఉంది.









