Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

నారాయణపేట్ లో ఘోరం.. ప్రభుత్వ వైద్య కళాశాల వసతి గృహంలో అగ్ని ప్రమాదం..!

నారాయణపేట పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపం లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల బాలికల వసతి గృహంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది.

నారాయణపేట్ లో ఘోరం.. ప్రభుత్వ వైద్య కళాశాల వసతి గృహంలో అగ్ని ప్రమాదం..!

(నారాయణపేట పట్టణం, మనసాక్షి – రమాకాంత్)

నారాయణపేట పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపం లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల బాలికల వసతి గృహంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. వేడినీటి కోసం విద్యార్థినులు వాటర్ హీటర్ పెట్టడంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన విద్యార్థినులు బయటికి పరిగెత్తుకొచ్చారు. అగ్ని ప్రమాదం జరిగిన గదిలో ఉన్న విద్యార్థినుల విలువైన వస్తువులు సర్టిఫికెట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డబ్బులు, పుస్తకాలు బెడ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఈ సందర్భంగా విద్యార్థినిలు మాట్లాడుతూ వసతిగృహంలో ఉండాల్సిన కనీస వసతులు మౌలిక సదుపాయాలు పేట వసతి గృహంలో లేవని, వసతి గృహంలో ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవని, వసతి గృహానికి సరైనయు వెంటిలేషన్ సౌకర్యం లేదని రాత్రిపూట వసతి గృహానికి భద్రత సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని, పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వసతిగృహంలో మాకు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే అడిగే నాథుడే కరువయ్యారని ఆవేదన వెలిబుచ్చారు.

మరిన్ని వార్తలు