బాలల దినోత్సవం సందర్భంగా ‘Unexpected Teachers’ పేరుతో యూరోకిడ్స్ క్యాంపెయిన్
పిల్లలు తమ దైనందిన అనుభవాల ద్వారా ఎలా నేర్చుకుంటారు, వారి చిన్ననాటి తొలి సంవత్సరాలలో సరైన ప్రీస్కూల్ వాతావరణం ఎందుకు ముఖ్యం అనే అంశాలను ఈ కొత్త క్యాంపెయిన్ ఎత్తిచూపుతోంది.

ముంబై, నవంబర్ 15, 2026: పిల్లలను సాధారణ విద్యార్థులుగానే చూస్తుంటాం. కానీ కొన్నిసార్లు వారే మనకు గొప్ప గురువులుగా మారుతుంటారు. ఈ బాలల దినోత్సవం సందర్భంగా ‘#అన్ఎక్స్పెక్టెడ్ టీచర్స్’ (#UnexpectedTeachers) అనే కొత్త క్యాంపెయిన్ ద్వారా యూరోకిడ్స్ ఈ ఆలోచనను వేడుకలా నిర్వహిస్తోంది. పిల్లల చిన్న చిన్న హావభావాలు కూడా మనకు ఎంతో అర్థవంతమైన జీవిత పాఠాలను నేర్పించగలవని ఇది పెద్దలకు గుర్తుచేస్తోంది.నవంబర్ 14న వచ్చే బాలల దినోత్సవం సందర్భంగా, నవంబర్ 11నే ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఒక విభిన్నమైన ఆహ్వానంతో ఈ క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఏదో పొరపాటు జరిగిందని అనిపించిన ఈ ప్రకటన.. పిల్లలు కూడా మనకు గురువులు కాగలరనే బ్రాండ్ ప్రధాన సందేశానికి అసలు పరిచయంగా నిలిచింది.ప్రతిరోజూ జరిగే సాధారణ సందర్భాల ఆధారంగా రూపొందించిన మనసుకు హత్తుకునే కథల ద్వారా.. పిల్లలు దయ, సానుభూతి మరియు అమాయకత్వంతో పెద్దలను ఎలా ఆశ్చర్యపరుస్తారో ఈ క్యాంపెయిన్ చూపిస్తుంది. ఈ చిత్రాలలో ఒకదానిలో, ఒక చిన్నారి చూపిన సాధారణ కృతజ్ఞతా భావం.. చుట్టూ ఉన్న పెద్దలను ఒక్కసారిగా ఆగి ఆలోచింపజేస్తుంది.
ఈ క్యాంపెయిన్ బాల్య దశకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా హైలైట్ చేస్తుంది. పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిరంతరం గమనిస్తూ, వాటిని గ్రహిస్తూ, నేర్చుకుంటూ ఉంటారు. వారు భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి, సంబంధాలను ఏర్పరచుకోవడానికి మరియు ఇతరులతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడానికి తొలినాళ్లలో వారి అనుభవాలు ఎంతగానో దోహదపడతాయి.
ఈ కీలకమైన దశలో ప్రీస్కూల్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. సముచితమైన వయసులోనే ప్రారంభించి సరైన అభ్యాస వాతావరణాన్ని కల్పిస్తే… సార్థకమైన పరస్పర చర్యలు, మార్గదర్శక అభ్యాసం, దైనందిన అనుభవాల ద్వారా పిల్లల సామాజిక, మానసిక వికాసం చక్కగా రూపుదిద్దుకుంటుంది.
లైట్హౌస్ లెర్నింగ్ (యూరోకిడ్స్), ప్రీ-కే డివిజన్, సీఈఓ, కేవీఎస్ శేషసాయి మాట్లాడుతూ, “చిన్న పిల్లల మనసులు చాలా సున్నితంగా, త్వరగా ప్రభావితమయ్యేలా ఉంటాయి. వారి అనుభవాలు భవిష్యత్తులో వారు ఎటువంటి వ్యక్తులుగా ఎదుగుతారనే దాంట్లో కీలక పాత్ర పోషిస్తాయి. తొలి ఏళ్లలో (1-6 సంవత్సరాలు) అభ్యాసం అనేది కేవలం చదువుకే పరిమితం కాకుండా, సామాజిక, భావోద్వేగ వికాసం చుట్టూ తిరుగుతుంది. చిన్న వయసులోనే సరైన వాతావరణాన్ని కల్పిస్తే అది జీవితంలో ఎంతో మార్పు తెస్తుంది. యూరోకిడ్స్ లో మేము అవార్డు గెలుచుకున్న మా ‘హురెకా’ (Heureka) కరిక్యులమ్, 20కి పైగా శిక్షణ కార్యక్రమాలతో తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు, ‘టూవ్ నార్డ్'(TÜV NORD) భద్రతా సర్టిఫికేషన్ కలిగిన ప్రీ-స్కూళ్లను ఒక్కచోట చేర్చి పిల్లలకు సరైన ప్రారంభాన్ని అందిస్తున్నాము. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఉత్తమమైనది చేయాలని కోరుకుంటారు. ఈ క్యాంపెయిన్ ద్వారా, తమ పిల్లలు చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి ఎంత ఎక్కువగా గ్రహిస్తున్నారో తల్లిదండ్రులు గుర్తించాలని, మొదటి నుంచే వారికి మంచి అభ్యాస అనుభవాలను అందించాలని మేము కోరుకుంటున్నాము” అని పేర్కొన్నారు.
#UnexpectedTeachers క్యాంపెయిన్ ద్వారా యూరోకిడ్స్ తల్లిదండ్రులను ఆలోచింపజేస్తోంది. తాము పిల్లల కోసం ఎలాంటి అభ్యాస వాతావరణాన్ని సృష్టిస్తున్నాం, ప్రతి ఒక్కరికి సరైన ప్రారంభాన్ని(Right Start) అందించడం ఎంత ముఖ్యమనే విషయాన్ని ఇది గుర్తుచేస్తోంది. ఈ బాలల దినోత్సవం సందర్భంగా అందరికీ ఇచ్చే సందేశం చాలా సులభమైనది: కొన్నిసార్లు జీవితంలో అతిపెద్ద పాఠాలు చిన్న గురువుల నుంచే నేర్చుకుంటాం.









