Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

సాగర్ సందర్శించిన ఇన్కమ్ టాక్స్ డైరెక్టర్ జనరల్

ప్రసిద్ధ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను ఆదివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజర్షి ద్వీవేది కుటుంబ సమేతంగా సందర్శించారు.

సాగర్ సందర్శించిన ఇన్కమ్ టాక్స్ డైరెక్టర్ జనరల్

(నాగార్జునసాగర్, మన సాక్షి – లక్ష్మి విజయ్)

ప్రసిద్ధ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను ఆదివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజర్షి ద్వీవేది కుటుంబ సమేతంగా సందర్శించారు. సాగర్ సందర్శనలో భాగంగా శనివారం రాత్రి నాగార్జునసాగర్ చేరుకున్న వీరు ఆదివారం నాగార్జున సాగర్ ప్రధాన డ్యామ్ ను, బుద్ధవనాన్ని, నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించారు.

బుద్ధవనం సందర్శనలో భాగంగా బుద్ధ చరిత వనములోని బుద్ధ పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. మహా స్తూపం లోని ధ్యాన మందిరంలో బుద్దవనం ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్ర రెడ్డి బుద్దవనం కండువాలతో, బ్రోచర్లతో వీరిని సత్కరించారు.

నాగార్జున కొండపై పునర్ నిర్మించినటువంటి అశ్వమేధ యజ్ఞశాల, మహా స్థూపం, సింహాళ విహారాన్ని సందర్శించారు. వీరు నాగార్జునకొండ మ్యూజియంలో భద్రపరచబడిన గౌతమ బుద్ధుని ధాతువులను మ్యూజియం క్యూరేటర్, పురావస్తూ శాఖ మ్యూజియంల అసిస్టెంట్ సూపర్డెంట్ కమలహాసన్ ఆధ్వర్యంలో దర్శించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్, బుద్ధవనం, నాగార్జునకొండ విశేషాలను వివరించారు.

మరిన్ని వార్తలు