Breaking : ట్రాక్టర్ ను ఢీ కొట్టిన టిప్పర్.. మానవత్వం చూపిన ఎమ్మెల్యే బిఎల్ఆర్..!
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మానవత్వం చూపారు. సొంత వాహనంలో రోడ్డు ప్రమాద భాధితులను ఆసుపత్రికి తరలించారు.

Breaking : ట్రాక్టర్ ను ఢీ కొట్టిన టిప్పర్.. మానవత్వం చూపిన ఎమ్మెల్యే బిఎల్ఆర్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మానవత్వం చూపారు. సొంత వాహనంలో రోడ్డు ప్రమాద భాధితులను ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం క్రిస్టాపురం గ్రామ పరిసరాల్లోని బైపాస్ రహదారిపై మంగళవారం బొల్లిగుట్ట తండాకు చెందిన రైతులు ధాన్యంతో వెళ్తున్న ట్రాక్టర్‌ను టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ..ఈ ప్రమాదంలో రైతులకు గాయాలయ్యాయి.
అదే మార్గంలో వెళ్తున్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు. మానవతా దృక్పథంతో తన సొంత వాహనంలో క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి, సకాలంలో వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు.
అనంతరం ఆసుపత్రి వైద్యులను సంప్రదించి, గాయపడిన రైతులు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
అలాగే ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.
ప్రమాద సమయంలో తక్షణమే స్పందించి గాయపడిన రైతులను ఆసుపత్రికి తరలించడంతో పాటు, వారికి మెరుగైన వైద్యం అందేలా చొరవ చూపిన ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ మానవతా దృక్పథంపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేశారు.










