వృద్ధులకు అండగా రాయపట్నం రామాలయం చెర్మన్
చలికాలంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్న యువకుడు ధర్మపురి, వెల్గటూర్, చలికాలంలో చలితో ఇబ్బందులు పడుతున్న నిరుపేద వృద్ధులకు అండగా నిలిచి రాయపట్నం గ్రామానికి చెందిన గోపతి చేరణ్ తన సేవా గుణాన్ని చాటుకున్నాడు.

వృద్ధులకు అండగా రాయపట్నం రామాలయం చెర్మన్
(జగిత్యాల ప్రతినిధి – అజయ్)
చలికాలంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్న యువకుడు ధర్మపురి, వెల్గటూర్, చలికాలంలో చలితో ఇబ్బందులు పడుతున్న నిరుపేద వృద్ధులకు అండగా నిలిచి రాయపట్నం గ్రామానికి చెందిన గోపతి చేరణ్ తన సేవా గుణాన్ని చాటుకున్నాడు. జగిత్యాల జిల్లా ధర్మపురి, వెల్గటూర్ ప్రాంతాల్లోని వృద్ధులను గుర్తించి దాదాపు 15 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
చలికాలం తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు రాత్రివేళల్లో చలిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన యువకుడు వారికి తన వంతు సహాయం అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వృద్ధుల వద్దకు వెళ్లి స్వయంగా దుప్పట్లు అందజేసి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు.
సమాజంలో ఆర్థికంగా వెనుకబడినవారికి, ముఖ్యంగా వయోవృద్ధులకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా చాటిచెప్పారు. యువకుడి సేవా కార్యక్రమంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని ఈ యువకుడు తన సేవా కార్యక్రమం ద్వారా నిరూపించారు.









