Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

అర్ధరాత్రి దుండగుల కుప్పకు నిప్పు.. కాలి బూడిద అయిన 120 క్వింటాళ్ల సోయా పంట..!

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టడంతో ఓ కౌలు రైతుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది.

అర్ధరాత్రి దుండగుల కుప్పకు నిప్పు.. కాలి బూడిద అయిన 120 క్వింటాళ్ల సోయా పంట..!

(కంగ్టి – జలీల్)

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టడంతో ఓ కౌలు రైతుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. కంగ్టి మండలం తుర్కవాడగాం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కౌలు రైతు అశోక్ ఎనిమిది ఎకరాల్లో సోయా పంటను సాగు చేశాడు. పంట కోత అనంతరం కుప్పగా వేసి పొలంలోనే నిల్వ ఉంచాడు. అయితే, అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ కుప్పకు నిప్పు పెట్టడంతో సుమారు 120 క్వింటాళ్లకు పైగా సోయా పంట పూర్తిగా దగ్ధమైంది.

కళ్లముందే చేతికందిన పంట బూడిదవడంతో రైతు అశోక్ కన్నీరు మున్నీరవుతున్నాడు. ఈ ఘటనకు బాధ్యులైన దుండగులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని, తీవ్రంగా నష్టపోయిన కౌలు రైతుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ రవీందర్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

మరిన్ని వార్తలు