Nalgonda : నల్గొండ డీఆర్వోకు కలెక్టర్ నివాళి
గుండెపోటుతో సోమవారం ఆకస్మికంగా మరణించిన నల్గొండ జిల్లా రెవెన్యూ అధికారి ఆర్. దశరథ్ నాయక్ భౌతిక ఖాయం పై జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ జిల్లా ఉన్నతాధికారులు మంగళవారం సూర్యాపేట జిల్లా, పాలకవీడు మండలం, కల్మట తండాలోని దివంగత డిఆర్ఓ ఆర్. దశరథ నాయక్ స్వగృహం వెళ్లి పుష్పగుచ్ఛాలుంచి శ్రద్ధాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.

మన సాక్షి, వెబ్ డెస్క్ :

డిఆర్ఓ దశరథ నాయక్ మృతి బాధాకరమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కీర్తిశేషులు దశరథ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నల్గొండ జిల్లా యంత్రాంగం తరఫున దశరథ నాయక్ కు నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ తో పాటు, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి, తదితరులు ఉన్నారు.