అర్థరాత్రి పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 10 మంది అరెస్ట్..!
అక్రమ పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్, వన్ టౌన్ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. స్థానిక ఐ. బి కాలనీలో గల వినాయక రెసిడెన్సి లాడ్జిలో మంగళవారం అర్ధరాత్రి డబ్బులు పందెం గా పెట్టి పేకాట ఆడుతున్న పది మందిని అదుపు తీసుకున్నారు.

అర్థరాత్రి పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 10 మంది అరెస్ట్..!
( గోదావరిఖని – శంకర్ )
అక్రమ పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్, వన్ టౌన్ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. స్థానిక ఐ. బి కాలనీలో గల వినాయక రెసిడెన్సి లాడ్జిలో మంగళవారం అర్ధరాత్రి డబ్బులు పందెం గా పెట్టి పేకాట ఆడుతున్న పది మందిని అదుపు తీసుకున్నారు.
వారి వద్ద నుండి రూ. 1, 36,30 నగదు,పది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐ వి కాలనీలో లాడ్జిలో పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు పోలీస్ కమిషనర్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్, నార్కోటిక్ ఏసీబీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ దాడి చేపట్టారు . ఖని వన్ టౌన్ సిఐ. ఇంద్రసేనారెడ్డి, టాస్క్ ఫోర్స్ ఎస్సై. దీకొండ రమేష్ సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు.
Also Read : వామ్మో మామూలు స్కెచ్ కాదు.. ఉద్యోగం, జీతం, సర్టిఫికెట్లు అన్ని ఫేక్.. లోన్ మాత్రం 30 లక్షలు..!
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో
ఎస్.ఎం.ఖాన్ టి. నర్సింగరావు, పి.తిరుపతి, ఎం.కుమార్, .కిరణ్, వి.సతీష్, ప్రవీణ్, ఆర్.మణి, ఎస్.కె.భాషి, కె. రాజ్‌కుమార్ ఉన్నారు. పట్టుబడిన 10 మంది వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న నగదు,సెల్‌ఫోన్లు చట్టపరమైన చర్యల నిమిత్తం గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్రమంగా పేకాట, జూదం నిర్వహించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.









