Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడ రైస్ మిలర్స్ కీలక నిర్ణయం.. ధాన్యం ధర ఫిక్స్.. క్వింటాల్‌కు ఎంతంటే..!

మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వానకాలం వారి ధాన్యం కొనుగోలు విషయంలో వీక్షులు ధర నిర్ణయించారు.

Miryalaguda : మిర్యాలగూడ రైస్ మిలర్స్ కీలక నిర్ణయం.. ధాన్యం ధర ఫిక్స్.. క్వింటాల్‌కు ఎంతంటే..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వానకాలం వారి ధాన్యం కొనుగోలు విషయంలో వీక్షులు ధర నిర్ణయించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ధాన్యం ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో వెంటనే స్పందించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో రైతులకు నష్టం కలగకుండా ధాన్యం క్వింటాల్‌కు రూ.3,500 తగ్గకుండా కొనుగోలు చేయాలని రైస్ మిల్లర్లకు ఎమ్మెల్యే హెచ్చరించారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, రైతులు ఆర్థికంగా నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

Also Read : రైతన్నతో ఆత్మీయ సభలో సిఎం రేవంత్ రెడ్డి.. రైతు భరోసా గురించి ఏమన్నారు..!

అనంతరం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మిర్యాలగూడ నియోజకవర్గంలోని ప్రతి రైస్ మిల్లులో ధాన్యం క్వింటాల్‌కు రూ.3,500 తగ్గకుండా కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ధాన్యం నాణ్యత బాగుంటే రూ.3,500 కంటే ఎక్కువ ధర కూడా చెల్లిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ధర కంటే తగ్గించి కొనుగోలు చేయబోమని రైతులకు హామీ ఇచ్చారు. సమావేశంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కర్నాటి రమేష్, బండారు కుశలయ్య, వెంకటరమణ చౌదరి, గందే రాము, గుడిపాటి శ్రీనివాస్, అంతయ్య తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు