Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణవ్యవసాయం

Rythu Bharosa : యాసంగి రైతు భరోసా ఎప్పుడు.. రైతుల ఎదురుచూపు.. లేటెస్ట్ అప్డేట్..!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా నిధులు యాసంగి సీజన్ లో ఎప్పుడు వస్తాయని రైతులు ఎదురుచూస్తున్నారు.

Rythu Bharosa : యాసంగి రైతు భరోసా ఎప్పుడు.. రైతుల ఎదురుచూపు.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా నిధులు యాసంగి సీజన్ లో ఎప్పుడు వస్తాయని రైతులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఇదే చర్చ కొనసాగుతుంది. వానాకాలం సీజన్లో రైతులు పంటలు సాగు చేసిన భూములకు మాత్రమే డిజిటల్ సర్వే ప్రకారం రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం విధితమే.

కాగా యాసంగి సీజన్లో ఎల్ నినో ప్రభావం వల్ల నీరు లేకపోవడంతో పాటు విద్యుత్ కూడా అందించలేమని స్పష్టం చేశారు. దాంతో యాసంగి సీజన్లో వరి పంటలు సాగు చేసుకోవద్దు అని పదేపదే ప్రకటించారు. ప్రత్యామ్నాయ పంటలు మాత్రమే రైతులు సాగు చేసుకోవాలని అధికారులు సూచించారు. కాగా పంటలు సాగు చేయకపోతే రైతు భరోసా నిధులు ప్రభుత్వం అందజేస్తుందా..? లేదా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఇదే చర్చ కొనసాగుతుంది.

ఇటీవల కాలంలో రెండు తుఫాన్ ల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. వరి పంటలు నేల వాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం ప్రకటన రాలేదు. అంతేకాకుండా నష్టపోయిన రైతుల వివరాలను కూడా సేకరించలేదు. అంతేకాకుండా ఇటీవల రైతు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతో రైతు భరోసా పథకం అందుతుందా..? లేదా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

Also Read : రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కోసం.. నల్గొండలో వ్యవసాయ ప్రదర్శన..!

ప్రభుత్వ ఏర్పాట్లు

రైతు భరోసా పథకం యాసంగి సీజన్ కు గాను రైతులకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని సమాచారం. సాగుతో సంబంధం లేకుండా రైతులందరికీ గత ఏడాది మాదిరిగానే ఈ యాసంగి సీజన్లో రైతు భరోసా అందించెందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం.

డిసెంబర్ 9వ తేదీ నాటికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతున్నందున అప్పటిలోగా ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఒకవేళ మూడేళ్ల పండుగ లో రైతు భరోసా పథకం నిధుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడిస్తే సంక్రాంతి పండుగలోగా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

మరిన్ని వార్తలు