Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Nalgonda : రైతులు పంట మార్పిడి విధానం, లాభసాటి సాగుపై దృష్టి పెట్టాలి..! 

రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని, ప్రభుత్వం రైతులకు లాభసాటి పంటల వైపు దృష్టి సారిస్తూ ప్రోత్సాహం అందిస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ వేముల వీరేశం అన్నారు.

Nalgonda : రైతులు పంట మార్పిడి విధానం, లాభసాటి సాగుపై దృష్టి పెట్టాలి..! 

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్, మనసాక్షి :

రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని, ప్రభుత్వం రైతులకు లాభసాటి పంటల వైపు దృష్టి సారిస్తూ ప్రోత్సాహం అందిస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ వేముల వీరేశం అన్నారు.
నకిరేకల్ పట్టణంలోని వినాయక బంకెట్ హాల్‌లో నిర్వహించిన జనపనార పంట సాగుపై అవగాహన కార్యక్రమం, విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ & నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ
అన్యధా ఫ్రూట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జనపనార విత్తనాలను అందజేయడమే కాకుండా రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తుందని తెలిపారు. రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి సారవంతం తగ్గుతోందని, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

పంట మార్పిడి ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయని, ప్రతి భూమి స్వభావానికి అనుగుణంగా సరైన పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.
జిల్లా వ్యవసాయ అధికారి వి వినోద్ కుమార్ మాట్లాడుతూ జనప పంటతో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుపై కూడా విస్తృత స్థాయిలో పరిశోధనలు, అన్వేషణలు జరుగుతున్నాయని చెప్పారు. రైతులకు ఆయా పంటల సాగు విధానాలు, లాభదాయకత, మార్కెట్ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని వివరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి మరియు పెరేపల్లి గ్రామాలకు చెందిన 25 మంది రైతులకు , 100 ఎకరాల్లో జనప నార పంట సాగు కోసం సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేశారు. ఈ విత్తనాల పంపిణీ ద్వారా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై మరింత ఆసక్తి చూపుతారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సమావేశానికి నకిరేకల్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు (ఏడీఏ) టీ . విజయేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజుల, వ్యవసాయ అధికారి జానీమియా, నియోజకవర్గంలోని అన్ని మండలాల వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పంటల వైవిధ్యీకరణ ద్వారా రైతుల ఆదాయం పెంపు, స్థిరమైన వ్యవసాయాభివృద్ధి సాధనపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

మరిన్ని వార్తలు