Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..!

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మిర్యాలగూడ మండలంలోని వెంకటాద్రిపాలెం సమీపంలో చోటుచేసుకుంది.

Miryalaguda : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మిర్యాలగూడ మండలంలోని వెంకటాద్రిపాలెం సమీపంలో చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మిర్యాలగూడ పట్టణంలోని బాపూజీ నగర్ కు చెందిన గుడుగుంట్ల విజయ ప్రసాద్ (31) తన స్నేహితులతో కలిసి కొండ అజయ్ నడుపుతున్న మోటార్ సైకిల్‌పై వి.టి.పాలెం ఎఫ్‌సీఐ గోదాముల వైపు వెళ్తున్నారు.

జంకు తండా వైపు వెళ్లేందుకు రోడ్డును దాటే సమయంలో మోటార్ సైకిల్ రైడర్ ఎడమ వైపు నుంచి లారీని ఓవర్‌టేక్ చేసి కుడివైపు మలుపు తిరిగాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ డ్రైవర్ గొల్ల ప్రకాష్ తన లారీని అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపి మోటార్ సైకిల్‌ను కుడి వైపు నుంచి ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో గుడుగుంట్ల విజయ ప్రసాద్‌కు తీవ్ర గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మోటార్ సైకిల్ రైడర్ కొండ అజయ్‌తో పాటు మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి.
ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.

మరిన్ని వార్తలు