Rythu Bharosa : 1,67,721మంది రైతుల ఖాతాల్లో రూ.215.15 కోట్లు జమ..!

Rythu Bharosa : 1,67,721మంది రైతుల ఖాతాల్లో రూ.215.15 కోట్లు జమ..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
రైతు సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ప్రాధాన్యత మరోసారి రైతు భరోసా నిధుల విడుదలతో వెల్లడైంది. 2025 వానాకాలం లో సాగుకు సిద్ధమవుతున్న ఈ సమయంలో రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేలా ప్రభుత్వం రైతు భరోసా నిధులను జమ చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిధుల ద్వారా విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు అవసరాలకు సంబంధించి రైతులకు మద్దతు లభించనుండటంతో, చాలా మంది రైతులు ముందుగానే అవసరమైన వ్యవసాయ సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విధంగా సాగుకు ముందు పెట్టుబడి సాయంగా రైతులకు రైతు భరోసా నిధులు అందడం ఎంతో మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రైతు భరోసా నిధుల విడుదల ద్వారా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు కృతజ్ఞతలు తెలిపారు. సాగులో జాప్యం కాకుండా సకాలంలో సహాయం అందించడం అభినందనీయమని రైతులు పేర్కొన్నారు.
రైతు అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగిస్తున్న చర్యలు భవిష్యత్తులో వ్యవసాయాన్ని మరింత స్థిరంగా, లాభదాయకంగా మార్చనున్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో 2025 సంవత్సరం వానాకాలం సీజన్ కు గానూ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడం ఎకరానికి సంవత్సరం కు 12 వేల రూ. ల చొప్పున వానాకాలం 2025 సీజన్ కు 6 వేల రూ ల చొప్పున రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది.
జిల్లాలో ఇప్పటి వరకు జూన్ 21 శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు 1, 67,721 మంది రైతుల ఖాతాల్లో రూ.215 కోట్ల 15 లక్షల నిధులు విజయవంతంగా జమయ్యాయని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. వానాకాలం 2025 రైతు భరోసా నిధుల పంపిణీపై మండలాల వారీగా వివరాలు జూన్ 21 మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లాలో వానాకాలం 2025కు సంబంధించిన రైతు భరోసా నిధుల పంపిణీ విజయవంతంగా కొనసాగుతోందనీ మొత్తం 13 మండలాల నుంచి 1,83,500 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్దిపొందేందుకు అర్హులుగా గుర్తించబడ్డారు.
ఇందుకోసం 262 కోట్ల 19 లక్షల రూపాయల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు తీసుకోగా, కాగా ఇప్పటి వరకు 1,67,721 మంది రైతులకు 215 కోట్ల 15 లక్షల రూపాయల నిధులు జమయ్యాయనీ తెలిపారు.ఈ కార్యక్రమం రైతు సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమని, వ్యవసాయ అధికారులు మరియు బ్యాంకర్లు సమన్వయంతో ఈ పంపిణీ సమర్థవంతంగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు.
గుండు మాల్ మండలంలో 7,101 మంది రైతులకు 8 కోట్ల 02 లక్షల రూ.లు, కోస్గి మండలంలో 11,363 మంది రైతులకు 12 కోట్ల 39 లక్షల రూ.లు, కొత్తపల్లి మండలంలో 6,678 మంది రైతులకు 7 కోట్ల 54 లక్షలు, మద్దూరు మండలంలో 14,440 మంది రైతులకు 16 కోట్ల 01 లక్షల రూ.లు, కృష్ణ మండలంలో 7,708 మంది రైతులకు 12 కోట్ల 75 లక్షల రూ.లు, మాగనూరు మండలంలో 8,967 మంది రైతులకు 14 కోట్ల 12 లక్షల రూ.లు, మక్తల్ మండలంలో 20,482 మంది రైతులకు 30 కోట్ల 26 లక్షల రూ.లు, నర్వ మండలంలో 12,834 మంది రైతులకు 19 కోట్ల 08 లక్షల రూ.లు,
ఉట్కూరు మండలంలో 17,427
మంది రైతులకు 25 కోట్ల 37 లక్షల రూపాయలు, దామరగిద్ద మండలము లో 17,908 మంది రైతులకు 20 కోట్ల 74 లక్షల రూపాయలు , ధన్వాడ మండలం 10,607 మంది రైతులకు 11 కోట్ల 61 లక్షల రూపాయలు, మరికల్ మండలం లో 12,879 మంది రైతులకు 15 కోట్ల 55 లక్షల రూపాయలు, నారాయణపేట మండలంలో 19,327 మంది రైతులకు 21 కోట్ల 67 లక్షల రూపాయలు రైతు భరోసా నిధులు వారి ఖాతాలలో జమ కావడం జరిగిందని తెలిపారు.
ప్రారంభంలోనే పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందజేసిన ఈ నగదును జిల్లా లోని రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు వాడుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో రూ.48 వేలు ఒకేసారి.. రైతుభరోసా మీకు రాలేదా.. వెంటనే ఇలా చేయండి..!
-
Agriculture : వ్యవసాయ రంగంలో AI టెక్నాలజీ.. రైతులకు ఇక పండుగ..!
-
District collector : పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. ఆ కేసుల జోలికి వెళ్తే క్రమశిక్షణ చర్యలు..!
-
District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..!









