తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Water Supply : 258 గ్రామాలకు రేపటి నుంచి నీటి సరఫరా నిలిపివేత..! 

Water Supply : 258 గ్రామాలకు రేపటి నుంచి నీటి సరఫరా నిలిపివేత..! 

నారాయణపేట టౌన్, మనసాక్షి :

గురువారం (రేపటి నుండి) ఉదయం 8:00 గంటల నుండి శుక్రవారం రాత్రి 8:00 గంటల వరకు మొత్తం 36 గంటలు నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు మహబూబ్ నగర్ మిషన్ భగీరథ గ్రిడ్ డివిజన్ కార్యనిర్వాహక అభయంత అధికారి డి. శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

క్రిస్టియన్ పల్లీ , మహబూబ్నగర్ దగ్గర నేషనల్ హైవే రోడ్డు విస్తరణ లో భాగంగా1200ఎంఎం పైపులైన్ మార్చడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి పని పూర్తి కావడానికి సుమారు 36 గంటలు నీటి సరపరా ఆపివేయడం జరుగుతుందని తెలిపారు.

మహబూబ్నగర్ పురపాలక సంఘం కు పాక్షికంగా, మన్యంకొండ నీటి శుద్దకరణ ప్లాంట్ నుండి వెళ్లే మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలోని 258 గ్రామాలకు , నారాయణపేట, మక్తల్, దేవరకద్ర పురపాలక సంఘాలకి పూర్తి గా నీటి సరఫరాలో అంతరాయము ఉంటుందని కావున ప్రజలందరూ సహకరించగలరని ఆయన కోరారు.

MOST READ : 

  1. Additional Collector : సూర్యాపేట జిల్లా రెవెన్యూ ఆదనపు కలెక్టర్ గా సీతారామారావు.. ఎవరో తెలుసా..!

  2. Water Well : బావులు గుండ్రంగానే ఎందుకు ఉంటాయి.. కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

  3. District collector : డిఈఓ పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. ఆ డిప్యూటేషన్ వెంటనే రద్దు చేయలని ఆదేశం..!

  4. Aadhaar Centers : ఆధార్ కేంద్రాల్లో దోపిడీ.. అదనపు వసూళ్లు.. పట్టించుకోని అధికారులు..!

  5. Open School : ఓపెన్ స్కూల్ దరఖాస్తు గడువు పెంపు..!

మరిన్ని వార్తలు