Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District collector : డిఈఓ పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. ఆ డిప్యూటేషన్ వెంటనే రద్దు చేయలని ఆదేశం..!

District collector : డిఈఓ పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. ఆ డిప్యూటేషన్ వెంటనే రద్దు చేయలని ఆదేశం..!

నల్లగొండ, మన సాక్షి :

ప్రభుత్వం నియమించిన చోట కాకుండా ఉపాధ్యాయురాయులీని ఎందుకు డిప్యూటేషన్ పై పంపించారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి డిఈఓ బిక్షపతి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి మండలం నరసింహుల గూడెం పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలుగా పి రోహిణినీ ప్రభుత్వం నియమించింది.

అయితే ప్రధానోపాధ్యాయురాలు రోహిణినీ అనారోగ్యం పేరుతో అక్రమంగా ఓ డి పై మునుగోడు మండలంలోని పులి పలుపులల పాఠశాలకు విద్యాశాఖ అధికారి డిప్యూటేషన్ వేశారు. మా ప్రధానోపాధ్యాయురాలుని మా పాఠశాలకు పంపించాలని. పాఠశాలకు ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులలో ఒకరిని డిప్యూటేషన్ వేయడం వలన ఒక ఉపాధ్యాయులతో ఇబ్బందిగా ఉందని సోమవారం నాడు ఆ పాఠశాలకు చెందిన చిన్నారి విద్యార్థినిలు, గ్రామస్తులైన, ఆంజనేయులు, గణేష్, శంకర్, బిక్షం ,రాజు ,నగేష్ లతో కలిసి వచ్చి ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

దీంతో కలెక్టర్ డీఈఓ ను పిలిపించి ఎందుకు డిప్యూటేషన్ వేశామని ప్రభుత్వం నియమించిన చోట కాకుండా మీరు ఎందుకు ఆమెను డిప్యూటేషన్ పంపారని ఆగ్రహం వ్యక్తం చేయగా, డిఇఓ సమాధానం ఇస్తూ ఆ ఉపాధ్యాయురాలిని గ్రామస్తులు అక్కడ పనిచేయ నీయడం లేదని కలెక్టర్ కు తెలిపారు.

.కలెక్టర్ ప్రభుత్వ ఉద్యోగులను పనిచేయనియాలని ఎవరు ఇబ్బంది పెట్టకూడదని చెప్తూ వెంటనే డిప్యూటేషన్ రద్దు చేసి నరసింహుల గూడెం పాఠశాల కు ప్రధానోపాధ్యాయురాలు రోహిణి నరసింహుల గూడెం పాఠశాలకు పంపియాలని కలెక్టర్ డి ఓ ను ఆదేశించారు. విద్యార్థులను ఇలా తిప్పకూడదని కలెక్టర్ గ్రామస్తులతో అంటూ పిల్లలను మంచిగా చదవనీయాలని వారిని ప్రోత్సహిస్తూ చాక్లెట్లు పంపిణీ చేశారు.

MOST READ : 

  1. Miryalaguda : రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశం..!

  2. Narayanpet : నిమజ్జనం లో అపశృతి.. డాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన మున్సిపల్ కార్మికుడు..!

  3. CM Revanth Reddy : సామాన్యుడిలా సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. (వీడియో)

  4. Paneer: పనీర్ తింటే మంచిదేనా.. సామర్థ్యం తెలుసుకోండి..!

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు