తెలంగాణBreaking Newsవ్యవసాయంహైదరాబాద్

TG News : 26 నుంచి 4 పథకాలు ప్రారంభం.. మీరు అర్హులేనా..!

TG News : 26 నుంచి 4 పథకాలు ప్రారంభం.. మీరు అర్హులేనా..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రేవంత్ సర్కార్ సంక్షేమ పథకాల బాట పట్టింది. అధికారంలోకి వచ్చి ఏడాది గడవడంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఈనెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకేసారి నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు నిర్ణయించారు. అందుకు సంబంధించిన వివరాలతో జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.

ఈనెల 26వ తేదీన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, ఇందిరమ్మ గృహాలు, కొత్త రేషన్ కార్డులు ప్రారంభం కానున్నాయి. ఈ పథకాల కోసం గ్రామాలలో గ్రామసభలు నిర్వహించను న్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను నిర్ణయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 24వ తేదీలోగా గ్రామసభలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

రైతు భరోసా : ఈ పథకం 26వ తేదీన ప్రారంభిస్తుండడం వల్ల రైతులకు ఎకరానికి 12000 రూపాయలు ఇవ్వనున్నారు. వాటిలో ఒక విడత 6000 రూపాయలను వారి వారి ఖాతాలో జమ చేయనున్నారు. గత ప్రభుత్వం రైతుబంధు ద్వారా ఎకరానికి 5000 రూపాయలు ఇవ్వగా కాంగ్రెస్ సర్కార్ 6000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది.

కొత్త రేషన్ కార్డులు : ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పేదలకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానున్నది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశారు.

ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా : భూమిలేని రైతు కూలీలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

ఇందిరమ్మ గృహాలు : ఇందిరమ్మ గృహాల పథకంలో 26వ తేదీన ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3500 గృహాలను మంజూరు చేస్తారు. ఇప్పటికే లబ్ధిదారుల కోసం సర్వే నిర్వహించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు