Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. అయిదుగురు అరెస్ట్..!

మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో పేకాట స్థావరంపై వన్ టౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతుండగా ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై సైదిరెడ్డి తెలిపారు.

Miryalaguda : మిర్యాలగూడలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. అయిదుగురు అరెస్ట్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో పేకాట స్థావరంపై వన్ టౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతుండగా ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై సైదిరెడ్డి తెలిపారు. తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో కాలనీ కంచనపల్లి లక్ష్మీ ఇంట్లో పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం మిర్యాలగూడ పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా సదరు లక్ష్మీ ఇంటిలో ఐదుగురు వ్యక్తులు చోటు అలియస్ ఇస్మాయిల్, మందడి శ్రీధర్ రెడ్డి, తాడూరి నాగేందర, కోలా నాగేందర్, మేడారం అంజయ్య లు పేకాటాడుతూ ఉండగా పట్టుబడ్డారు. వారి వద్ద నుండి పేక ముక్కలు, 4 సెల్ ఫోన్లు, 6300 రూపాయల నగదు సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు