Srisailam : శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద.. విద్యుత్ ఉత్పత్తితో దిగువకు నీరు..!
Srisailam : శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద.. విద్యుత్ ఉత్పత్తితో దిగువకు నీరు..!
హైదరాబాద్, మనసాక్షి :
శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా చేరుతుంది. కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుంది. జూరాల, సుంకేసుల నుంచి 78 వేల 837 క్యూసెక్కు ల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతుంది.
శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 863. 80 అడుగులు గా ఉంది. డ్యాం పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 115.502 టీఎంసీలుగా ఉంది.
ALSO READ :
1. Telangana : తెలంగాణ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయాలు..!
2. Admin Review : కొత్త టూల్స్.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల శక్తివంతం ..!
3. వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!
శ్రీశైలం జలాశయానికి 863 అడుగుల నీరు చేరడంతో కుడి , ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 19, 070 క్యూసెక్కు ల వరద నీరు దిగువకు నాగార్జున సాగర్ కు వదులుతున్నారు.









