వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!

వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!

మనసాక్షి :

ఆమె మామూలు భార్య కాదు. భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు చేయడంతో పాటు ఆమె తప్పును కప్పిపుచ్చుకునేందుకు భర్తపై తప్పుడు ఆరోపణలు సైతం చేసింది. ఆమెకు కర్ణాటక హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. పిటిషనర్ (భర్త ) కోరుకున్న ప్రకారం ఆమె నుంచి విడాకులు మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

 

భర్త నల్లగా ఉన్నాడని వేధించడం క్రూరత్వం కిందికే వస్తుందని ఆ మహిళను కోర్టు మందలించింది. వివరాల ప్రకారం.. 2007లో వారిద్దరికీ వివాహం జరిగింది. 2012లో భర్త విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్ ను ఫ్యామిలీ కోర్టు 2017 జనవరి 13న తిరస్కరించింది.

 

అయితే దాన్ని సవాల్ చేస్తూ అతడు హైకోర్టుకు వెళ్లాడు. వివాహం జరిగిన నాటి నుంచి తన భార్య తనను నల్లగా ఉన్నాడని వేధింపులకు గురి చేస్తుందని పిటీషన్ లో పేర్కొన్నాడు. తన కూతురు కోసం ఇంతకాలం అవన్నీ భరించానని, 2011లో తన తల్లి ఇతర కుటుంబ సభ్యులపై భార్య కేసు వేసిందని తెలిపాడు. ఆ కేసు విషయంలో అతను ఇబ్బందులు పడ్డట్లు పేర్కొన్నాడు. పోలీస్ స్టేషన్లో గడిపానని, కోర్టుల చుట్టు తిరిగినట్లు వివరించాడు.

 

ALSO READ : 

  1. WhatsApp : వాట్సాప్ లో కీలక మార్పు.. యూజర్స్ అంతా తెలుసుకోవాల్సిందే..!
  2. Runa Mafi : రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది..? తెలుసుకుందాం..!
  3. PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కేవలం రూ.49 తో రూ. లక్ష..!
  4. Vande Bharath : తెలంగాణకు మరో వందేభారత్.. ఏడు గంటల్లోనే గమ్యం..!

 

తన భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని తిరిగి రాలేదని, నేను పనిచేసే చోట యజమానికి కూడా ఫిర్యాదు చేసిందని, మానసికంగా వేధింపులకు గురి అయినట్లు పిటిషన్లు పేర్కొన్నాడు. తనకు విడాకులు మంజూరు చేయాలని అభ్యర్థించాడు.

 

పిటిషనర్ భార్య అతడిపై రివర్స్ ఆరోపణలు చేసింది. తన భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని, ఆమెతో ఒక బిడ్డను కూడా కాన్నాడని చెప్పింది. తనను ఎప్పుడూ తిట్టేవాడని, ఇంటి నుంచి బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదని, ఇంటికి ఆలస్యంగా వస్తే కొట్టేవాడని ఆరోపించింది.

 

అయితే కోర్టు ఆమె ఆరోపణలను పరిగణనలోకి తీసుకోలేదు. వీటికి నిరాధార ఆరోపణలుగా కొట్టి పారేసింది. ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు భర్తతో కలిసి ఉంటానని ముందుకు రావడం పై అనుమానాలు వ్యక్తం చేసింది. భర్తతో కలిసి ఉండే ఉద్దేశం ఆమెకు లేదని అభిప్రాయపడ్డ కోర్టు చివరకు ఇద్దరికి విడాకులు మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.