Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసూర్యాపేట జిల్లా

జీలుగ సాగుతో రైతుకు లాభాలెన్నో.. తెలుసుకోండి ఇలా..! 

తక్కువ సారవంతమైన భూములను బాగుచేసేందుకు ఎక్కడి నుంచో మట్టిని తోలి వృథా ఖర్చులు పెట్టుకోవడం కన్నా, పచ్చిరొట్ట ఎరువుల సాగుతో పొలాలను స్వయంగా సారవంతంగా మార్చుకోవచ్చని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.

జీలుగ సాగుతో రైతుకు లాభాలెన్నో.. తెలుసుకోండి ఇలా..! 

నేల సారవంతంతో పాటు పంటల దిగుబడులు పెరిగే అవకాశం

తుంగతుర్తి, మనసాక్షి :

తక్కువ సారవంతమైన భూములను బాగుచేసేందుకు ఎక్కడి నుంచో మట్టిని తోలి వృథా ఖర్చులు పెట్టుకోవడం కన్నా, పచ్చిరొట్ట ఎరువుల సాగుతో పొలాలను స్వయంగా సారవంతంగా మార్చుకోవచ్చని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గం లోని ఆయా మండలాల్లో పచ్చిరొట్ట పంటలైన జీలుగ, జనుము, పిల్లిపెసర సాగును ప్రభుత్వం విశేషంగా ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న జీలుగ విత్తనాలను రైతులందరూ సద్వినియోగం చేసు కోవాలని అధికారులు కోరుతున్నారు.

సాగు విధానం, ఎరువుల యాజమాన్యం : 

పంట భూముల్లో జీలుగ విత్తనాలు వేసిన కేవలం 25 నుంచి 30 రోజుల్లోనే పంట ఏపుగా పెరుగుతుం ది. రైతులు ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్త నాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మొదట దుక్కిలో 20 నుంచి 30 కిలోల యూరియా వేసి ఆపై విత్తనాలను చల్లుకోవాలి. మొక్కలు ఆరోగ్యంగా, బలంగా పెరిగేందుకు క్రమపద్ధతిలో తడులు ఇవ్వడం అవసరం. పంట ఏపుగా పెరిగిన తర్వాత రోటివేటర్ సహాయంతో ఆ మొక్కలను పొలంలోనే కలియదున్నాలి.

దున్నిన అనంతరం ఎకరాకు 100 కిలోల సింగిల్ సూపరఫాస్పేట్ను దుక్కిలో చల్లాలి. ఈ సూపర్ ఫాస్పేట్ వల్ల భూమిలో కలియదున్నిన మొక్కల అవశేషాలు చాలా త్వరగా కుళ్లి, నాణ్యమైన పచ్చిరొట్ట ఎరువుగా మారుతుంది.

పచ్చిరొట్టతో కలిగే ప్రయోజనాలు :

పొలంలో పెంచిన జీలుగ మొక్కలను భూమిలోనే కలియదున్నడం ద్వారా నేల భౌతిక, రసాయన, జీవ లక్షణాలు అద్భుతంగా వృద్ధి చెందుతాయి. ఇది నేల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, అత్యంత తక్కువ ఖర్చుతో భూమికి ఎక్కువ మొత్తం లో సేంద్రియ పదార్థాన్ని అందిస్తుంది. దీనివల్ల నేల గుల్లబారి గాలి ప్రసరణ పెరిగి, నీటి పారుదల వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే నేలలో కరగని స్థితిలో ఉన్న మూలకాలను సైతం ఇవి పంటకు అనుకూలంగా మారుస్తాయి.

భూమికి సేంద్రియ రసం అందడం వల్ల నేలలో మేలు చేసే సూక్ష్మజీవు లు వృద్ధి చెంది, అనేక జీవ రసాయన చర్యల ద్వారా పోషకాలు నేరుగా మొక్కలకు అందుతాయి. జీలుగ మొక్కల వేర్లలో నత్రజని స్థిరీకరణ అధికంగా ఉండ టం వల్ల, నేలకు సహజ మిత్రులైన వానపాముల ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది. జింక్, మాంగ నీస్, ఇనుము, కాల్షియం వంటి అవసరమైన సూక్ష్మ మూలకాలు పంటకు లభిస్తాయి.

పొలంలో జీలుగ సాగు చేయడం వల్ల తుంగ, గరికే వంటి మొండి కలుపు మొక్కల నివారణ సులువవుతుంది. మొక్క లకు అదనంగా రెండు శాతం నత్రజని, సూపర్ ఫాస్పేట్ లభించడం వల్ల పంటలకు అన్ని రకాల పోషకాలు అంది, ఆశించిన దానికంటే అధిక దిగు బడులు వస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

పచ్చిరొట్ట సాగు చేయాలి –  రమేష్ బాబు, ఏడిఏ, తుంగతుర్తి.:

జీలుగ సాగు చేసే రైతులు జూన్ మొదటి వారంలోగా పంటను విత్తుకోవాలి. పం ట వేసిన 45 రోజులకు చేనులోనే కలియదున్నాలి. దీంతో ఎకరానికి 8-10 టన్నుల సేంద్రియ పదార్థం నేలకు అందుతుంది. జీలుగ సాగు వల్ల రసాయనిక ఎరువుల వాడకం తగ్గుతుం ది. ఫలితంగా నాణ్యమైన పంట దిగుబడులు సాధ్యమవుతాయి.

By : Subhash, Thungathurthy

మరిన్ని వార్తలు