Breaking Newsక్రైంజాతీయం
కర్ణాటకలో దారుణం.. యువతిని నరికి చంపిన ప్రేమోన్మాది..!
కర్ణాటకలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే బస్టాండ్ వద్ద ప్రేమొన్మాది యువతిని నరికి చంపాడు.

కర్ణాటకలో దారుణం.. యువతిని నరికి చంపిన ప్రేమోన్మాది..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
కర్ణాటకలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే బస్టాండ్ వద్ద ప్రేమొన్మాది యువతిని నరికి చంపాడు. మంగళూరు సమీపంలోని బంట్వాల్ బస్టాండ్‌లో ఓ యువకుడు రెచ్చిపోయాడు. 21 ఏళ్ల లావణ్యను నడిరోడ్డుపైనే అత్యంత కిరాతకంగా నరికి చంపాడు.
దూరపు బంధువైన చేతన్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. లావణ్యను కత్తితో పొడిచి చంపి అక్కడి నుండి పరారయ్యాడు.
నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హత్యకు కారణం ప్రేమ వ్యవహారమేనని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతోనే లావణ్యను చేతన్ చంపేశాడని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









