Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా
తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి..!
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలో ఇద్దరు పిల్లలను నీటి సంపులో పడేసి తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది.

తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి..!
వెల్దండ, మన సాక్షి:
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలో ఇద్దరు పిల్లలను నీటి సంపులో పడేసి తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని పోతేపల్లి గ్రామానికి చెందిన ఎనుముల మహేష్ భార్య శిరీష (23), తమ ఇంటి ఆవరణలో ఉన్న సంపులో కుమార్తె మానశ్రీ (3) కుమారుడు వర్షిత్ (4 నెలలు) శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పిల్లలను సంపులో పడేసి ఆపై తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న వెల్దండ ఎస్సై యుగంధర్ రెడ్డి కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. మృతికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తూ..కుటుంబ కలహాలతోనే ఈ ఘటన జరిగినట్టు అనుమానిస్తున్నారు.









