Miryalaguda : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత..!
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకటేష్ అన్నారు.

Miryalaguda : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత..!
మిర్యాలగూడ, మన సాక్షి :
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకటేష్ అన్నారు. శుక్రవారం
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యాక్షులు మిట్టపల్లి వెంకటేష్, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి మిర్యాలగూడ 40వ వార్డు శాంతినగర్లో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా జరిపించారు.
మిట్టపల్లి వెంకటేష్, విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస చారి, ఏఈ టౌన్-2 రవీందర్ రెడ్డి, మారం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత. నేడు మనం నాటే ఒక్కొక్క మొక్క రేపటి తరానికి మనం ఇచ్చే ఆక్సిజన్ బహుమతి అని అన్నారు.
ప్రతి ఇంటికీ ఒక చెట్టు – ప్రతి గుండెకు స్వచ్ఛమైన ఊపిరి అనే నినాదంతో ముందుకు సాగాలని, భవిష్యత్ తరాలకు కాలుష్యం లేని హరిత తెలంగాణను అందించడానికి ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్, సతీష్, ఎల్లా చారి, రాము, సీనయ్య పాల్గొన్నారు.









