Breaking Newsజిల్లా వార్తలుమంచిర్యాల జిల్లా
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చేవరకు కదిలేది లేదు..!
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చే వరకు కదిలేది లేదని మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన నిరుపేదలైన కొందరు మహిళలు తాసిల్దార్ కార్యాలయం ముందు బుధవారం రోజు బైఠాయించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చేవరకు కదిలేది లేదు..!
మందమర్రి. మనసాక్షి
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చే వరకు కదిలేది లేదని మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన నిరుపేదలైన కొందరు మహిళలు తాసిల్దార్ కార్యాలయం ముందు బుధవారం రోజు బైఠాయించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో మా పేర్లు నోటీస్ బోర్డ్ లో ఉన్నప్పటికీ వాటిని తొలగించి మళ్లీ ఇండ్లు ఉన్నవారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించారని ఆరోపించారు.
నిరుపేదలమైన మాకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని గత రెండు రోజులుగా తాసిల్దార్ కార్యాలయం ముందు కూర్చున్నప్పటికీ సంబంధిత అధికారులు గానీ రాజకీయ నాయకులు గానీ మమ్మల్ని పట్టించుకున్న వారే లేరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా ఎండైనా వానైనా మాకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చే అంతవరకు తాసిల్దార్ కార్యాలయం ముందు నుండి కదిలేది లేదని భీష్ముంచుకు కూర్చున్నారు.