Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

Vemulapally : కోతుల బెడద నివారించాలని కోరుతూ వినతి..!

వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామంలో రోజురోజుకూ పెరుగుతున్న కోతుల బెడదను నివారించాలని కోరుతూ గురువారం జై భీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ సందరబోయిన చంద్రయ్య, పంచాయతీ కార్యదర్శి బంటు మహేష్ లకు వినతిపత్రం అందజేశారు.

Vemulapally : కోతుల బెడద నివారించాలని కోరుతూ వినతి..!

వేములపల్లి, మన సాక్షి:

వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామంలో రోజురోజుకూ పెరుగుతున్న కోతుల బెడదను నివారించాలని కోరుతూ గురువారం జై భీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ సందరబోయిన చంద్రయ్య, పంచాయతీ కార్యదర్శి బంటు మహేష్ లకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ.. గ్రామంలో కోతుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారని తెలిపారు. ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామ ప్రజల భద్రత దృష్ట్యా సంబంధిత అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసి కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో జైభీమ్ యువజన సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు