Vande Bharath : తెలంగాణకు మరో వందేభారత్.. ఏడు గంటల్లోనే గమ్యం..!

Vande Bharath : తెలంగాణకు మరో వందేభారత్.. ఏడు గంటల్లోనే గమ్యం..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణకు మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు రానున్నది. ప్రస్తుతం రెండు వందే భారత్ రైళ్లు ఉండగా వాటికి ఆదరణ బాగా పెరిగింది. కాగా మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కూడా ప్రారంభం కానున్నది.

 

సికింద్రాబాద్ – విశాఖ, సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నడుస్తున్న ఈ రెండు వందే భారత్ రైళ్లకు అంచనాలకు మించి ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే మరో వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు.

 

దేశంలోనే ఐటి నగరాలుగా పేరున్న హైదరాబాద్ , బెంగళూరు మధ్య వందే భారత్ ను ప్రారంభించనున్నారు. కాచిగూడ నుంచి బెంగళూరు వరకు ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. వందే భారత్ ద్వారా 7 గంటల్లోనే లోనే బెంగళూరు చేరుకునే అవకాశం కలగనున్నది. ట్రయల్ రన్ కూడా నిర్వహించారు .

 

ఐటీ సిటీల మధ్య వందే భారత్ :

వందే భారత్ రైలు రెండు ఐటి సిటీల మధ్య నడవనున్నది. కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్ వరకు ఈ రైలు నడిపేందుకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 6వ తేదీన ఈ రైలును లాంచనంగా ప్రారంభించే అవకాశాలున్నాయి..

 

ఏడు గంటల్లో గమ్యం :

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా డోన్ మీదుగా ఈ రైలు నడవనున్నది. హైదరాబాద్ – బెంగళూరు రెండు ఐటీ సిటీల మధ్య వందే భారత్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సిటీల మధ్య రైలు ప్రయాణానికి 11 గంటల సమయం పడుతుంది.

 

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం ఏడు గంటల్లోనే గమ్యం చేరుకునే అవకాశం ఉంటుంది. మహబూబ్ నగర్, కర్నూల్ , గుంతకల్లు మీదుగా బెంగళూరు చేరుకుంటుంది.

రూట్ షెడ్యూల్ పై అధికారులకు ఒక క్లారిటీ రావడంతో, టైమింగ్స్, చార్జీలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

 

ALSO READ 👇

1. Telangana : తెలంగాణలో రైతు బీమా తరహాలోనే.. మరొకటి..!

2. WhatsApp : వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. అదిరిపోయే ఫీచర్ మరొకటి..!

3. Restarent : ఆ రెస్టారెంట్ లో తినాలంటే నాలుగేళ్ల ముందే బుక్ చేసుకోవాలంట.. స్పెషల్ ఏంటో..?

4. Womens : నిరుపేద మహిళలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు..!

5. Chicken : చికెన్ కిలో రూ.100 మాత్రమే.. గంటలోనే అన్ని షాపుల్లో ఖాళీ..!