Restarent : ఆ రెస్టారెంట్ లో తినాలంటే నాలుగేళ్ల ముందే బుక్ చేసుకోవాలంట.. స్పెషల్ ఏంటో..?

Restarent : ఆ రెస్టారెంట్ లో తినాలంటే నాలుగేళ్ల ముందే బుక్ చేసుకోవాలంట.. స్పెషల్ ఏంటో..?

మనసాక్షి , వెబ్ డెస్క్:

ఆన్ లైన్ లో ఇప్పుడు ఆర్డర్ పెడితే అరగంటలో ఇంటికి భోజనం సరఫరా చేస్తున్న రెస్టారెంట్లు ఉన్నాయి. ఫేమస్ రెస్టారెంట్ లోనైతే ముందుగా ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రెస్టారెంట్ లలో టేబుల్ కోసం గంటల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరికొన్ని రెస్టారెంట్ లలో మూడు, నాలుగు రోజుల ముందు బుకింగ్ చేసుకునేవి కూడా ఉంటాయి.

 

కానీ ఇది వినడానికే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఆ రెస్టారెంట్ లో తినాలంటే నాలుగేళ్ల ముందే బుక్ చేసుకోవాలంట. ఆ రెస్టారెంట్ ఎక్కడుందో? స్పెషల్ ఏంటో..? తెలుసుకుందాం. ఆ రెస్టారెంట్ యూకే లోని ఓ చిన్న పబ్. అది అక్కడ ఆదివారం టేబుల్ బుక్ చేసుకోవాలంటే అంత ఈజీ కాదు. ఆ చిన్న పబ్ గురించి తెలిస్తే మీరు అవక్కవుతారు.

 

యూకే లోని బ్రిస్టల్ లో ఉన్న ” ది బ్యాంక్ ట్విస్ట్ ” ( The Bank Tavern ) అనే చిన్న పబ్బు. ఇక్కడ ఆదివారం రోజున భోజనాన్ని బుక్ చేసుకోవడానికి చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా సిద్ధం చేసే సండే రోస్టుల కోసం ఏకంగా నాలుగు సంవత్సరాల ముందే బుక్ చేసుకోవాలంట. రెస్టారెంట్ బుకింగ్ నిపుణులు యూకే లోనే సుదీర్ఘ వేటింగ్ లిస్ట్ ఉన్న పబ్ గా దీనిని గుర్తించారు.

 

కాగా కరోనా సమయంలో దేశవ్యాప్తంగా చాలా పబ్ లు, రెస్టారెంట్లు మూసివేయాల్సి వచ్చింది. దాంతో ఈ పబ్ లో సండే రోస్టుల కోసం ముందస్తుగా బుకింగ్ వెయిటింగ్ లిస్టు అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు అక్కడ బుకింగ్ చేసుకునే వాళ్ళు సండే రోస్టులు తినాలంటే నాలుగేళ్లు ఆగాల్సిందే.

 

సండే రోస్టుల ప్రత్యేకత ఆ రెస్టారెంట్. అందులో ప్రత్యేకమైన వంటకాలు వడ్డిస్తారట. 2018 లోనే బ్రిస్టల్ గుడ్ ఫుడ్ అవార్డ్స్ లో ఉత్తమ సండే లంచ్ గా ఇది ఎంపిక అయింది. 2019లో ఉన్న ఈ చిన్న పబ్ అబ్జర్వర్ ఫుడ్ మంత్లీ అనే అవార్డుతో సొంతం చేసుకుంది.

 

ALSO READ : 

  1. Womens : నిరుపేద మహిళలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు..!
  2. Rains : వర్షాలు తగ్గుముఖం పట్టాయి.. కానీ..!
  3. Chicken : చికెన్ కిలో రూ.100 మాత్రమే.. గంటలోనే అన్ని షాపుల్లో ఖాళీ..!
  4. Atm Card : ఏటీఎం కార్డు వినియోగదారులకు ఆర్బీఐ కొత్త రూల్స్.. మారిన నిబంధనలు..!
  5. TSRTC : నిరుద్యోగుల గుడ్ న్యూస్ : టిఎస్ ఆర్టీసీలో ఐటిఐ దరఖాస్తులకు ఆహ్వానం..!