Womens : నిరుపేద మహిళలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు..!

అదృష్టం తలుపుతట్టుతుంది అంటే అదే. నిరుపేదలైన ఆ మహిళలు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు.

నిరుపేద మహిళలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

అదృష్టం తలుపుతట్టుతుంది అంటే అదే. నిరుపేదలైన ఆ మహిళలు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. రెక్కాడితే కానీ డొక్కాడదు వారికి. ఒకేసారి 10 కోట్ల రూపాయలు వచ్చాయి. వివరాలు తెలుసుకుందాం…

 

కేరళలోని పరప్పన్ గడి మున్సిపాలిటీలో హరిత కర్మ సేన తరఫున కొంతమంది మహిళలు పని చేస్తున్నారు. వీరిలో భూమిలో కలిసిపోయే వ్యర్ధాలను ఇళ్లలో, కార్యాలయాలలో సేకరిస్తారు. సేకరించిన వ్యర్థాలను రీసైక్లింగ్ కోసం యూనిట్లకు పంపుతారు. ఇక్కడ పనిచేసే 11 మంది మహిళలు కలిసి ఒక లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. వారి దగ్గర డబ్బులు లేకపోయినా… అప్పు చేసి మరి డబ్బులు జమచేసి 250 రూపాయలు వెచ్చించి లాటరీ టికెట్ కొనుగోలు చేశారు.

 

కాగా లాటరీ డిపార్ట్మెంట్ వారు గత బుధవారం రాత్రి డ్రా తీశారు. లక్కీగా 10 కోట్లలో రూపాయల లాటరీ వారికి తగిలింది. దాంతో వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోనున్నాయి. 10 కోట్ల రూపాయల లాటరీ రావడంతో ఆ 11 మంది నిరుపేద మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. వచ్చిన డబ్బులను అందరూ సమానంగా పంచుకుంటామని పేర్కొన్నారు. లాటరీ ద్వారా వచ్చిన డబ్బులతో అప్పులను తీర్చుకొని, మంచి ఇల్లు నిర్మించుకొని పిల్లలను చదివించుకుంటామని వాళ్లు పేర్కొన్నారు.

 

ALSO READ :

  1. Chicken : చికెన్ కిలో రూ.100 మాత్రమే.. గంటలోనే అన్ని షాపుల్లో ఖాళీ..!
  2. TSRTC : ప్రయాణికులకు ఆర్టీసీ మరో శుభవార్త .. రూ. 50కే రోజంతా ప్రయాణం..!
  3. Atm Card : ఏటీఎం కార్డు వినియోగదారులకు ఆర్బీఐ కొత్త రూల్స్.. మారిన నిబంధనలు..!
  4. Telangana : సారూ.. ఏవీ..? ఆ.. రూ.10 వేలు..?