Breaking Newsక్రైంజిల్లా వార్తలునారాయణపేట జిల్లా
BREAKING : నారాయణపేట జిల్లా కేంద్రంలో మురుగు కాలువలో బాలుడి మృతదేహం లభ్యం..!
జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న సత్యనారాయణ స్వామి దేవాలయం దగ్గర వల్లంపల్లి రోడ్డులోని మరుగునీటి కాలువలో బాలుడి మృతదేహం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

BREAKING : నారాయణపేట జిల్లా కేంద్రంలో మురుగు కాలువలో బాలుడి మృతదేహం లభ్యం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :-
జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న సత్యనారాయణ స్వామి దేవాలయం దగ్గర వల్లంపల్లి రోడ్డులోని మరుగునీటి కాలువలో బాలుడి మృతదేహం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. అటువైపు వెళుతున్న స్థానికులు మురుగునీటి కాలువలో పడ్డ పసికందును గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పురపాలక పారిశుద్ధ్య సిబ్బంది సహాయంతో పసికందును బయటకు తీసి బయటకి తీసి జిల్లా ఆసుపత్రికి పంపించారు. పసికందు ఎలా చనిపోయాడు అనే విషయాలు తెలియాల్సి ఉంది.









