Suryapet : సూర్యాపేట జిల్లా సర్వారంలో అగ్ని ప్రమాదం..!
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Suryapet : సూర్యాపేట జిల్లా సర్వారంలో అగ్ని ప్రమాదం..!
గరిడేపల్లి, మన సాక్షి
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మిట్ట మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో ఊరి బయట ఉన్న స్కూలు వద్ద ఒక్కసారిగా నాలుగు గడ్డివాములలో మంటలు రావడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందా అనే పేరుకొని చూసేసరికి ఒక్కసారిగా నాలుగు గడ్డివాములపై మంటలు లేస్తూ ఉండడం కనిపించింది.
వెంటనే సమయస్ఫూర్తితో ఎస్ఈపిఎల్ స్టోన్ క్రషర్ యాజమాన్యానికి సమాచారం అందించి వెనువెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడం జరిగింది. సమయస్ఫూర్తితో స్పందించిన ఎస్ఈపిఎల్ సిబ్బంది మరియు అగ్నిమాపక సిబ్బంది ఆలస్యం చేయకుండా ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది.
ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో గుమ్మడేల్లి శ్రీను, గుమ్మడెల్లి బిక్షం, గుమ్మడెల్లి మట్టయ్య, మామిడి మట్టయ్యలకు చెందిన నాలుగు గడ్డి వాములు సుమారు 40 ఎకరాల గడ్డి అందాజా రెండు లక్షల రూపాయల విలువ గల గడ్డి తగలబడిపోయింది.
పశువుల నోటి కాడ గడ్డి తగలబడుతుండటంతో దానిని కాపాడలేక ఇటు వదులుకోలేక విలవిల్లాడి పోయారు. ప్రభుత్వ అధికారులు వెంటనే పరిశీలన జరిపించి గడ్డికి నష్టపరిహారం అందేలాగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.









