ఆంధ్రప్రదేశ్Breaking News
ఎరువుల దుకాణాలలో విజిలెన్స్, ఎన్ఫోరసెమెంట్ అధికారుల ఆకస్మిక తనిఖీలు..!
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని కేసీ పల్లి గ్రామపంచాయతీ లోని బాలాజీ ట్రేడర్స్ నందు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఎరువుల దుకాణాలలో విజిలెన్స్, ఎన్ఫోరసెమెంట్ అధికారుల ఆకస్మిక తనిఖీలు..!
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని కేసీ పల్లి గ్రామపంచాయతీ లోని బాలాజీ ట్రేడర్స్ నందు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు . ఈ తనిఖీల్లో భాగంగా నిబంధనలకు అనుగుణంగాలేని ఎరువుల నిల్వలు 6.85 మెట్రిక్ టన్నులు. 2,65,750 రూపాయలు విలువచేసే ఎరువులను జప్తు చేయడం జరిగింది. ఈ తనిఖీలలో విజిలెన్స్ అధికారులు జి లక్ష్మణ్ కుమార్ , రామయ్య , మండల వ్యవసాయ అధికారి జాఫర్ తదితరులు పాల్గొన్నారు.









