Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Miryalaguda : రైతులు ఈ పంటలు మాత్రమే సాగు చేయాలి.. వ్యవసాయ అధికారుల సూచనలు..!

ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు జగదీశ్వర్ రెడ్డి కోరారు.

Miryalaguda : రైతులు ఈ పంటలు మాత్రమే సాగు చేయాలి.. వ్యవసాయ అధికారుల సూచనలు..!

మిర్యాలగూడ జూలై 21, మన సాక్షి :

ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు జగదీశ్వర్ రెడ్డి కోరారు.

మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి రైతువేదిక లో వ్యవసాయశాఖ మండల వ్యవసాయ అధికారి రుషేంద్రమని ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మిర్యాలగూడ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ

ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు, భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి. బోర్లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. అలాగే చెరువులు పూర్తిస్థాయిలో నిండే పరిస్థితి కనిపించడం లేదు. చివరి దశలో వర్షాలు వచ్చినా కూడా చెరువులు పూర్తిగా నిండే అవకాశం తక్కువగా ఉందన్నారు.

అందువల్ల రైతులు మొత్తం విస్తీర్ణంలో వరి సాగు చేయకుండా, కొంత భాగంలో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేయగల పంటలు, జొన్న, పెసలు, మినుములు, కంది, పొద్దుతిరుగుడు, ఆముదం, రాబోయే రోజుల్లో బోర్లు, చెరువుల ద్వారా నీటి లభ్యత మరింత తగ్గే అవకాశం ఉన్నందున్నారు. నీటిని ఆదా చేస్తూ ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి నష్టాలను తగ్గించుకోవాలని సూచించారు.

రైతులందరూ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి సాగును కొంత మేర తగ్గించి, ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి గోపి, రాంచంద్ర రెడ్డి , సతీష్ , రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు